డెంగ్యూ వ్యాధి సొకడానికి ఆ ఒక్క దోమ కారణం.. ఎందుకో తెలుసా..

By Sandra Ashok KumarFirst Published Oct 5, 2020, 1:12 PM IST
Highlights

చాలా మంది కూడా డెంగ్యూ వ్యాధి సోకి ప్రాణాలతో బయటపడ్డ వారు తమ అనుభవాన్ని పంచుకున్నారు, అయితే ఒక ప్రశ్న ఎప్పుడూ సందేహిస్తుంటుంది డెంగ్యూ బారిన పడటానికి కేవలం  ఒక దోమ కాటు మాత్రమేనా అని ? దీనికి నిపుణుల అభిప్రాయం ప్రకారం అవును అనే సమాధానం వస్తుంది.
 

డెంగ్యూ వ్యాధి ఒక ప్రమాదకరమైన వైరల్ ఇన్ఫెక్షన్ అనడంలో సందేహం లేదు, ఎందుకంటే డెంగ్యూతో బాధపడుతున్న వారి బాధ వర్ణణహితం. డెంగ్యూ సోకి ప్రాణాలతో బయటపడిన ఆల్కా గుప్తా అనే మహిళా తన అనుభవాన్ని తెలుపుతూ “నాకు 23 ఏళ్ళ వయసులో నాకు డెంగ్యూ వచ్చింది. పూర్తిగా కోలుకోవడానికి నాకు దాదాపు 6 నెలలు పట్టింది.

మొదట కీళ్ల నొప్పులు, జ్వరం వచ్చింది, అందువల్ల నాకు డెంగ్యూ ఉందని డాక్టర్ గుర్తించగలిగారు. రెండు వారాల పాటు నిరంతరం మందులు వాడిన తరువాత ఇన్ఫెక్షన్ పోయింది. కాని నా బలాన్ని తిరిగి పొందడానికి, కీళ్ల నొప్పులు, వికారం తగ్గటానికి నాకు ఆరు నెలలు పట్టింది.

ఆ ఆరు నెలలు నేను పడ్డ బాధ చెప్పుకోలేనిది, అప్పుడు నేను ఒక దోమ కూడా ఎంతో ప్రమాదకరమని నేను తెలుసుకున్నాను. ” చాలా మంది కూడా డెంగ్యూ వ్యాధి సోకి ప్రాణాలతో బయటపడ్డ వారు తమ అనుభవాన్ని పంచుకున్నారు, అయితే ఒక ప్రశ్న ఎప్పుడూ సందేహిస్తుంటుంది డెంగ్యూ బారిన పడటానికి కేవలం  ఒక దోమ కాటు మాత్రమేనా అని ? దీనికి నిపుణుల అభిప్రాయం ప్రకారం అవును అనే సమాధానం వస్తుంది.


డెంగ్యూ వైరస్ మనిషికి దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఈడెస్ ఈజిప్టి వైరస్ సోకిన దోమ కుట్టిన తరువాత డెంగ్యూ వ్యాధి లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. అయితే లక్షణాలు బయటపడదనికి నాలుగైదు రోజులు పడుతుంది.

ఈ దశను వైరెమియా అని పిలుస్తారు. ఒక వ్యక్తి రక్తంలో అత్యధిక స్థాయిలో డెంగ్యూ వైరస్ ఉన్న ఒకటి లేదా రెండు రోజులు వరకు ఎటువంటి వ్యాధి లక్షణాల కనిపించవు కానీ అది త్వరగా జ్వరంతో లక్షణం బయట పడుతుంది. జ్వరం ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది.


డెంగ్యూ వ్యాధి మనిషి  నుండి మనిషికి వ్యాపించదు. అయితే ఈ ఇన్ఫెక్షన్ లేదా డెంగ్యూ వైరస్ ఒక వ్యక్తి నుండి మరొకరికి వ్యాప్తి చెందే ఏకైక మార్గం దోమలు. దోమల నుండి సురక్షితంగా ఉండటం, మీ ఇంటిలోకి  దోమలు రాకుండా చూసుకోవడం చాలా మంచిది.

గోద్రేజ్ కాలా హిట్ వంటి మశ్కిటో స్ప్రేతో  ఇంటిని క్రమం తప్పకుండా స్ప్రే చేయటం వంటి సరైన జాగ్రత్తలు తీసుకోవడం డెంగ్యూ రహితంగా ఉండటానికి ఉత్తమ ఎంపిక. బయటికి వెళితే దోమ కాటును నివారించడానికి చేతులకు పొడవాటి స్లీవ్‌లు ధరించడం మంచిది.

ప్రస్తుత పరిస్థితిలో కోవిడ్-19 కూడా ఇలాంటి లక్షణాలను చూపిస్తుంది. కాబట్టి అధిక జ్వరం లక్షణాన్ని గుర్తించలేకపోయే ప్రమాదం కూడా ఉంది. డెంగ్యూ లక్షణాలను అర్థం చేసుకోని గుర్తించటం వల్ల సరైన చికిత్సను సకాలంలో పొందటానికి సహాయపడుతుంది.

మీరు ఒకటి లేదా రెండు దోమలు కనిపిస్తే వెంటనే గోద్రేజ్ కాలా హిట్‌ స్ప్రే తో దోమలను తక్షణమే చంపడం డెంగ్యూ నివారణకు ఒక ఉత్తమమైన మార్గం.
 

click me!