దోమలతో జాగ్రత్త, డెంగ్యూ వ్యాధి ఎప్పుడైనా ఎవరికైనా రావొచ్చు: నిపుణులు

By Sandra Ashok KumarFirst Published Oct 6, 2020, 10:38 AM IST
Highlights

ఈ దోమలు వాటర్ ట్యాంకులు, వాటర్ కంటైనర్లు, వాటర్ ఉన్న పాత టైర్లతో సహా ఒక చోట నిల్వ ఉన్న అన్నీ నీటి ప్రదేశాలలో ఈ దోమలు వృద్ధి చెందుతాయి. సరైన పారిశుద్ధ్యం లేకపోవడం, శుభ్రత లేకపోవడం కూడా ఒక ప్రదేశంలో దోమల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తుంది.
 

డెంగ్యూ అనేది విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న దోమల వ్యాధి. ఇది భారతదేశంతో సహా 100కి పైగా దేశాలలో ఉంది. ఈ వైరస్ నాలుగు జాతులు ఏడెస్ ఈజిప్టి దోమ ద్వారా వ్యాపిస్తాయి.

ఈ దోమలు వాటర్ ట్యాంకులు, వాటర్ కంటైనర్లు, వాటర్ ఉన్న పాత టైర్లతో సహా ఒక చోట నిల్వ ఉన్న అన్నీ నీటి ప్రదేశాలలో ఈ దోమలు వృద్ధి చెందుతాయి. సరైన పారిశుద్ధ్యం లేకపోవడం, శుభ్రత లేకపోవడం కూడా ఒక ప్రదేశంలో దోమల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తుంది.

భారతదేశంలో ప్రతి సంవత్సరం 1.5 లక్షల డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ సోకిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, కానీ వారికి ఎటువంటి లక్షణాలను బయటపడవు.

మన దేశంలో డెంగ్యూ ద్వారా పెద్ద ముప్పు ఉందని చూపించడానికి ఈ కేసులు సరిపోతాయి. చాలా సంవత్సరాలుగా ప్రజలు డెంగ్యూ ఇన్ఫెక్షన్ వర్షాకాలంలో మాత్రమే సంభవిస్తుందని, పగలు లేదా సాయంత్రం మాత్రమే దోమ చురుకుగా ఉంటాయని నమ్ముతారు.

also read ఒక్క దోమ ఉన్నా డేంజరే... వర్షాకాలంలోనే కాదు ఎప్పుడైనా డెంగ్యూ కాటేయచ్చు.. ...

డెంగ్యూ జాతి దోమలు లేదా ఈడెస్ ఈజిప్టి దోమ ప్రవర్తనపై సాధారణ అధ్యయనాలలో ఇవన్నీ అపోహలు అని తేలింది. భారతదేశంలో డెంగ్యూ వైరస్ స్థానికంగా ఉంది, అంటే ఈ వైరస్ సంక్రమణ ఏడాది పొడవునా, అన్నీ రోజులో ఎప్పుడైనా ఎవరికైనా సంభవిస్తుంది.

దోమ మోసే వైరస్ పట్టణ, సబర్బన్ ప్రదేశాలలో ఎక్కువగా కనపడుతుంది, ఇక్కడ దోమలు చురుకుగా ఉన్నంతవరకు డెంగ్యూ వ్యాధి  వ్యాప్తి జరుగుతునే ఉంటుంది.

వేసవి, శీతాకాలంలో డెంగ్యూ వైరస్ బారిన పడ్డ వారు వారి అనుభవాలను చెప్తూ "డిసెంబరులో నాకు డెంగ్యూ వచ్చింది, నేను చాలా ఆశ్చర్యపోయాను, ఎందుకంటే ఇది వర్షాకాలంలో మాత్రమే వస్తుందని నేను అనుకున్నాను" అని బెంగళూరు నుండి డెంగ్యూతో  ప్రాణాలతో బయటపడిన విమల్ కళ్యాణ్ పంచుకున్నారు అన్నారు .

హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తి డెంగ్యూతో  ప్రాణాలతో బయటపడిన రోనీ దత్తా తన అనుభవాన్ని తెలుపుతూ “ఇది వేసవికాలం, వేడి కారణంగా దోమలు మనుగడ సాగించవని నేను ఊహించాను. నాకు డెంగ్యూ వచ్చినప్పుడు నేను తప్పుగా అనుకున్నాను అని అర్ధమైంది. వాతావరణం లేదా సీజన్‌కు డెంగ్యూతో సంబంధం లేదని నేను గ్రహించాను, డెంగ్యూ ఎప్పుడైనా సంభవించవచ్చు. ” అని అన్నారు.

ఈ ప్రజల అనుభవం నుండి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ప్రతిరోజూ దోమలకు వ్యతిరేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఒకటి లేదా రెండు దోమలను కనిపించిన సరే వెంటనే చర్య తీసుకోండి. గోద్రేజ్ కాలా హిట్‌తో దోమలను తక్షణమే చంపడం వల్ల డెంగ్యూ నివారణకు ఉత్తమమైన  మార్గం అని గుర్తుంచుకోండి.
 

click me!