నయా మోసం.. రూ.3 కోట్లు కొట్టేసిన కిలాడి కపుల్స్.. 

By Rajesh Karampoori  |  First Published Jan 30, 2024, 12:01 AM IST

Rose Gold Beauty Parlour: అమాయకులను టార్గెట్ చేస్తూ కేటుగాళ్లు రోజుకో కొత్త మార్గంలో ప్రయత్నాలు చేస్తున్నారు. స్వంత వ్యాపారం బ్రాండెడ్ ఫ్రాంచైజీ పేరుతో బురిడీ కొట్టించారు. వందలాది మంది నుంచి కోట్లాది రూపాయాలను వసూల్ చేసి ఉడాయించారు కిలాడీ కపుల్స్ .. ఇంతకీ ఏం జరిగిందో మీరు కూడా ఓ లూక్కేయండి..   


Rose Gold Beauty Parlour: అమాయకులను టార్గెట్ చేస్తూ మోసం చేయాలని కేటుగాళ్లు కొత్త కొత్త రీసెర్చ్ చేస్తున్నారేమో అనే సందేహాలు కలుగుతోంది. ఎందుకంటే.. రోజుకో నయా మోసం వెలుగులోకి వస్తుంది. నిజంగా మోసగాళ్లు.. రోజుకో రూపంలో.. పూటకో వేశంలో.. అమాయకులను మోసం చేస్తున్నారు. మాటలతో నమ్మబలికి నిలునా దోచేస్తున్నారు.  ఉన్నత చదువులు చదుకున్న వారిని కూడా ఉపాధి మార్గాల పేరుతో.. సులభంగా సంపాదించొచ్చనీ, అతికొద్ది రోజుల్లో కోటీశ్వర్లు కావొచ్చని మోసాలకు పాల్పడుతున్నారు.

అందిన కాడికి దొచుకుని ..ఉడాయిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. మోసపోయక లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు బాధితులు. తాజాగా ఓ కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. అదీ కూడా మన హైదరాబాద్ కేంద్రంగా.. ఓ బ్రాండెండ్ బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీలు అంటూ నయా మోసానికి తెర తీశారు. వందకు పైగా అమాయకులను మోసం చేస్తూ..  ఏకంగా రూ. 3 కోట్లు వసూలు చేసి.. వాటితో ఉడాయించారు కిలాడీ కపుల్స్.  చివరకు తాము మోసపోయామంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించడంతోఈ బాగోతం వెలుగులోకి వచ్చింది.

Latest Videos

undefined

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్ లోని ప్రగతినగర్ హెడ్ ఆఫీస్ అడ్డాగా అక్క సమీనా, బావ ఇస్మాయిల్, మరదలు జన్సిక కలిసి ఓ నకిలీ బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు.  రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో యాడ్స్ చేశారు. తన ఫ్రాంచైజీని తీసుకుంటే.. నెలకు 35 వేల జీతం ఇస్తామని నమ్మించారు. ఆ ప్రకటనలకు ఆట్రాక్టయినా వారిని .. ఈ కేటుగాళ్లను సంప్రదించారు. అలా వారిని నమ్మిన వారిని తమ మాటలతో బురిడీ కొట్టించి.. తమ సంస్థలో డబ్బులు పెట్టుబడులు పెడితే.. అది కొద్దీ కాలంలోనే తమ పెట్టుబడిని రెండింతలు.. మూడింతలు చేసుకోవచ్చని నమ్మ బలికారు.

ఈ కేటుగాళ్ల మాటలు నమ్మిన పలువురు డబ్బులు పెట్టుబడి పెట్టారు. అలా ఒక్కొక్కరి నుంచి బ్యూటీ పార్లర్ ఫ్రాంఛైజీ పేరుతో రూ. 3లక్షల 20 వేల వరకు వసూలు చేశారు. అలా వందకు పైగా బ్యూటీ పార్లర్లు ఓపెన్ చేశారు.తొలి రెండు మూడు నెలలు .. పెట్టుబడులు పెట్టిన వారికి చెప్పినట్లే కొంత జీతం కూడా ఇచ్చారు. కానీ.. వారు అనుకున్న టార్గెట్ నిండగానే ..  మొత్తం 3 కోట్లకు పైగా డబ్బుతో పత్తా లేకుండా పారిపోయారు.

ఎన్ని సార్లు ఫోన్ చేసినా.. వారి ఫోన్లు కలువకపోవడంతో.. కొంతమంది ఆఫీసు కూడా వచ్చారు. . ఆఫీసు కొన్నిరోజుల నుంచి తెరవడం లేదని తెలుసుకుని.. చివరకు మోసపోయామని గుర్తించిన బాధితులు .. బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఎక్కువ మంది మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కిలాడీ కపుల్స్ కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో ఇదే బ్యాచ్ చిట్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసి పారిపోయినట్లు తేలింది. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని  పోలీసులు సూచిస్తున్నారు.

click me!