Basar IIIT:ఇంజనీరింగ్ ఫస్టియర్ విద్యార్థి ప్రవీణ్ కుమార్ ఆత్మహత్య

By narsimha lodeFirst Published Nov 26, 2023, 5:25 PM IST
Highlights

బాసర ట్రిపుల్ ఐటీలో  ఇంజనీరింగ్ ఫస్టియర్ స్టూడెంట్  రామాటి ప్రవీణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రవీణ్ కుమార్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ  కాలేజీలో ఇంజనీరింగ్  ఫస్టియర్ చదివే విద్యార్ధి  ఆర్. ప్రవీణ్ కుమార్ ఆదివారంనాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీకి అనుబంధంగా ఉన్న  హాస్టల్ నాలుగో అంతస్తులో  ప్రవీణ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడిన  రామాటి ప్రవీణ్ కుమార్ స్వస్థలం  నాగర్ కర్నూల్ జిల్లా. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం భైంసా ఆసుపత్రికి తరలించారు.

గతంలో కూడ బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీలో  ఈ ఏడాది ఆగస్టు మాసంలో  బబ్లూ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన జాదవ్ బబ్లూ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారని అప్పట్లో ప్రకటించారు.  ఈ ఏడాది జూన్ మాసంలో  ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 13న  బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధిని దీపిక ఆత్మహత్య చేసుకంది. అదే నెల  15వ తేదీన లిఖిత అనే విద్యార్ధిని మృతి చెందింది. ఈ ఇద్దరి మృతిపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం నుండి నివేదిక కోరింది. 

2022 ఆగస్టు 7న  బాసర ట్రిపుల్ ఐటీని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సందర్శించారు.2022 డిసెబర్ 19న భానుప్రసాద్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.  రంగారెడ్డి జిల్లా మంచాలకు  చెందిన  భానుప్రసాద్  పీయూసీ-2 చదువుతున్నాడు.  2022 ఆగస్టు  23న  బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధి సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు.  నిజామాబాద్ డిచ్ పల్లి సురేష్ గ్రామం. 

2002 జూలై మాసంలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు.తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు.ఈ ఆందోళనతో  రాష్ట్ర ప్రభుత్వం దృష్టిని విద్యార్థులు తమ వైపునకు తిప్పుకున్నారు.  మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు  బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు.  విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

click me!