నా భార్యతో మీ భర్త ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి: నెహ్రా భార్యకు యువరాజ్ ఫిర్యాదు

By Arun Kumar PFirst Published Mar 2, 2019, 11:36 AM IST
Highlights

టీమిండియా  మాజీ ప్లేయర్, పేస్ బౌలర్ ఆశిశ్ నెహ్రాపై మరో భారతీయ ఆటగాడు యువరాజ్ సింగ్ ఫిర్యాదు చేశాడు. తన భార్య మిచెల్ తో మీ భర్త ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి అంటూ నెహ్రా భార్య రుష్మా నెహ్రాకు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అందుకు సంబంధించిన ఓ ఫోటోను కూడా యువరాజ్ ఇన్స్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.  ఇంతకు  యువరాజ్ భార్యతో నెహ్రా ఎందుకలా ప్రవర్తించాడో తెలసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 
 
టీమిండియా ప్లేయర్ యువరాజ్ సింగ్ తన భార్య మిచెల్ పుట్టినరోజు వేడుకలను గత గురువారం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు యువరాజ్ సహచర క్రికెటర్లు కొందరిని ఆహ్వానించగా భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, అజిత్ అగార్కర్ తదితరులు హాజరయ్యారు. వీరంతా కలిసి పుట్టినరోజు పార్టీలో సరదాగా గడిపారు. 

ఈ క్రమంలో హాజెల్ కీచ్ చేత పుట్టినరోజు కేక్ కట్ చేయించారు. ఈ సమయంలో హాజెల్ పక్కనే వున్న భర్త యువరాజ్ తో పాటు ఆశిశ్ నెహ్రా హడావుడి చేశారు. నెహ్రా కేక్ ను హాజెల్ కు తినిపిస్తూనే  సరదాగా ముఖానికి పూశాడు. అయితే ఇలా నెహ్రా  తన భార్యకు కేక్ పూస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువరాజ్ ఓ సరదా కామెంట్ ను జత చేశాడు. 

నెహ్రా భార్య రుష్మా నెహ్రాకు యువరాజ్ ఈ విధంగా ఫిర్యాదు చేశాడు. ''చూడండి...నా భార్య ముఖాన్ని మీ భర్త ఎలా చేశాడో'' అని పేర్కొంటూ హాజెల్ ముఖానికి నెహ్రా కేక్ పూస్తున్న పోటోను జతచేశాడు. 

యువరాజ్ ఇన్స్‌స్టాగ్రామ్ లో సరదాగా చేసిన  ఈ పోస్ట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నెటిజన్లు ఈ పోస్ట్ పై సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేస్తుండటంతో వైరల్ గా మారింది.

click me!