భారత్‌కు పాక్ శత్రువు వు కాదు... మీ శత్రువే మాకూ శత్రువు: వసీం అక్రమ్

By Arun Kumar PFirst Published Mar 1, 2019, 3:27 PM IST
Highlights

భారత్ తమ మాతృదేశం పాకిస్థాన్ ని ఓ శత్రువుగా చూస్తోందని పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ పేర్కొన్నారు. అయితే పాక్ ఎప్పటికి భారత్ కు శత్రువు కాదన్నారు. ఇలా ఇరుదేశాలు ఎవరో చేసిన తప్పులను ఒకరిపై మరొకరు తోసుకుంటూ బద్దశత్రువుల్లా మారిపోయాయన్నారు. అసలు ఇరు దేశాల కామన్ శత్రువులు ఒక్కరేనని అక్రమ్ తెలిపారు. 

భారత్ తమ మాతృదేశం పాకిస్థాన్ ని ఓ శత్రువుగా చూస్తోందని పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ పేర్కొన్నారు. అయితే పాక్ ఎప్పటికి భారత్ కు శత్రువు కాదన్నారు. ఇలా ఇరుదేశాలు ఎవరో చేసిన తప్పులను ఒకరిపై మరొకరు తోసుకుంటూ బద్దశత్రువుల్లా మారిపోయాయన్నారు. అసలు ఇరు దేశాల కామన్ శత్రువులు ఒక్కరేనని అక్రమ్ తెలిపారు. 

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త, యుద్ద వాతావరణంపై అక్రమ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ''  మిమ్మల్ని(భారత్‌ను) బరువెక్కిన హృదయంతో వేడుకుంటున్నా... భారత్ కు పాకిస్థాన్ శత్రుదేశం కాదు, మీ శతృవే మాకు కూడా శత్రువులు. అదే ఉగ్రవాదం. ఈ విషయాన్ని తెలుసుకోడానికి మన రెండు దేశాలు ఇంకెన్ని సార్లు యుద్దం చేసి రక్తం చిందించాల్సి వస్తుందో. ఇరు దేశాలు సోదరభావంతో కలిసి పనిచేస్తూ ఉగ్రవాదాన్ని అరికట్టాలి.'' అంటూ అక్రమ్ ట్వీట్ చేశారు. 

పుల్వామా ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్ సర్జికల్ స్ట్రైక్, పాక్ ప్రతిస్పందన ఇలా ప్రస్తుతం దాయాది దేశాల మధ్య పరిస్థితులు అల్లకకల్లోలంగా మారిన విషయం తెలిసిందే. అంతేకాకుండా భారత వైమానిక దళ పైలట్ అభినందన్ ను పాక్ ఖైదుచేయడంతో పరిస్ధితులు మరింత దిగజారాయి. అయితే ఇరుదేశాలు తమ ప్రమేయం లేకుండానే ఇలా యుద్దానికి సిద్దమవుతున్నారంటూ...ఇద్దరి కామన్ శతృవు వారిని ఆ దిశగా పురిగొల్పినట్లు వసీం అక్రమ్ అభిప్రాయపడ్డారు.  

భారత పైలట్ అభినందన్ విషయంలో భారత్ తో పాటు అంతర్జాతీయ దేశాల ఒత్తిడికి తలొగ్గిన పాక్ విడుదలకు సిద్దమైంది. శుక్రవారం అతన్ని భారత్ కు  అప్పగించనున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. ఇలా అభినందన్ ఇవాళ భారత్ కు తిరిగిరానున్నాడు. 

 

With my heavy heart I appeal to yours, India,Pakistan is not your enemy, Your enemy is our enemy! How much more blood needs to be spilled before we realise we are both fighting the same battle.We need brothers in arm if we want to beat this war on terror

— Wasim Akram (@wasimakramlive)

   

click me!