హైదరాబాద్ వన్డేలో ధోని ఆడటం అనుమానమే...కారణమిదే

By Arun Kumar PFirst Published Mar 1, 2019, 6:17 PM IST
Highlights

ఇప్పటికే స్వదేశంలో జరిగిన టీ20 సీరిస్ కోల్పోయిన టీమిండియాను కలవరపెట్టే సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. మొదటి వన్డే కోసం హైదరాబాద్ లో జరుగుతున్న ప్రాక్టిస్ సెషన్లో టీమిండియా సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ప్రాక్టిస్ ను మధ్యలోనే వదిలేని ధోని వెళ్లిపోయాడు. ఈ క్రమంలో హైదరాబాద్ వన్డేలో ధోని ఆడటంపై సందేహం నెలకొంది. 

శనివారం ఆస్ట్రేలియాతో జరగనున్న మొదటివన్డే కోసం భారత జట్టు ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకుంది. ఈ క్రమంలో శుక్రవారం ఆటగాళ్లంతా ప్రాక్టిస్ సెషన్లో పాల్గొన్నారు. అయితే జట్టు సభ్యలతో కలిసి బ్యాటింగ్ ప్రాక్టిస్ చేస్తుండగా ధోని గాయపడ్డాడు. జట్టు సహాయ సభ్యుడైన రాఘవేంద్ర విసిరిన బంతి ధోని మోచేతికి బలంగా తాకింది. నొప్పితో విలవిల్లాడిపోయిన అతడు బ్యాట్ ను వదిలేసి కాస్సేపు మైదానంలోనే అలా కూర్చుండిపోయాడు. అనంతరం ప్రాక్టిస్ కొనసాగించకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 

ధోనికి వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం హైదరాబాద్ వన్డేలో ఆడతాడో...లేడో టీంమేనేజ్మెంట్ ప్రకటించనుంది. గాయం తీవ్రత మరీ ఎక్కువగా వుంటే హైదరాబాద్ మ్యాచ్ కే కాదు ఈ సీరిస్ మొత్తానికి ధోని దూరమయ్యే అవకాశాలున్నాయి. దీంతో భారత  అభిమానుల్లో, టీమిండియా శిబిరంలో మేనేజ్ మెంట్ ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. 

ఇప్పటికే ఆస్ట్రేలియా చేతిలో విశాఖ, బెంగళూరు టీ20ల్లో ఓటమిపాలైన భారత్ ఎట్టి పరిస్థితుల్లో వన్డే సీరిస్ ను గెలవాలని పట్టుదలతో వుంది. అంతేకాకుండా చివరి టీ20 లో ధోని, కోహ్లీ ఇద్దరు బ్యాటింగ్ లో రాణించారు. దీంతో వీరు వన్డే సీరిస్ లో కూడా రాణిస్తే భారత్ కు ఎదురుండదని భావించారు. అయితే తాజాగా  ధోని ప్రాక్టిస్ సెషన్లో గాయపడటం భారత అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది.  

click me!