ఆసిస్ పై అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డు... సచిన్ తర్వాత ధోనీదే

By Arun Kumar PFirst Published Mar 6, 2019, 9:26 AM IST
Highlights

ఆస్ట్రేలియా జట్టుతో మ్యాచ్ అంటేనే ఈ మధ్య ఎంఎస్ ధోని చెలరేగిపోతున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా వేదికన జరిగిన వన్డే సీరిస్ ద్వారా మళ్లీ పామ్ ను అందిపుచ్చుకున్న ధోని  అప్పటినుండి వెనుదిరిగి చూడటంలేదు. ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్ సీరిస్, తాజాగా మళ్లీ స్వదేశంలో ఆసిస్ తో వన్డే సీరిస్ లో ధోని తన సత్తా చాటుతున్నాడు. ఇలా 2019లో ఆడిన ఆరు మ్యాచుల్లో 150 సగటుతో 301 పరుగులు చేసిన ధోని ఈ ఏడాదిలో ఇప్పటివరకు అత్యుత్తమ వన్డే ఆటగాడిగా నిలిచాడు.   

ఇక ఈ ఏడాదిలో ఆస్ట్రేలియాతోనే  అత్యధిక  వన్డేలాడిన ధోని ఏకంగా ఐదు అర్థశతకాలు సాధించాడు. దీంతో ఆసిస్ అతడు సాధించిన హాఫ్ సెంచరీల సంఖ్య 13కు చేరింది. భారత ఆటగాళ్లలో ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా సచిన్ నిలవగా...అతడి తర్వాతి స్థానాన్ని ధోని ఆక్రమించాడు.

ఆస్ట్రేలియాను వారి స్వదేశంలో మట్టికరిపించి టీమిండియా చారిత్రాత్మక వన్డే సీరిస్ విజయం సాధించడంలో ధోని ప్రధాన పాత్ర పోషించాడు. నాలుగు మ్యాచుల్లో అర్థశకాలతో రెచ్చిపోయి బ్యాటింగ్ చేసిన ధోని తిరిగి ఫామ్ ను అందుకున్నాడు. అదే పామ్ ను కొనసాగిస్తూ ప్రస్తుతం భారత పర్యటనలో వున్న అదే ఆసిస్ జట్టుపై మరోసారి చెలరేగి ఆడుతున్నాడు. నాగ్ పూర్ వన్డేలో విఫలమైనా హైదరాబాద్ లో జరిగిన మొదటి వన్డలో ధోని హాఫ్ సెంచరీతో మెరిని జట్టును విజయతీరాలకు చేర్చాడు. యువ క్రికెటర్ కేదార్ జాదవ్ తో కలిచి చక్కటి ఇన్నింగ్స్ నెలకొల్పి ఆసిస్ నిర్దేశించిల లక్ష్యాన్ని ధోని సునాయాసంగా చేదించగలిగాడు. 

ప్రపంచ కప్ కు ముందు భారత జట్టులో కీలక ఆటగాడైన ధోని ఫామ్ లోకి రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ధోని విజృంభణతో మరో ప్రపంచ కప్ ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

click me!