సచిన్ సెంచరీ విజయాల రికార్డును సమంచేసిన కోహ్లీ...

By Arun Kumar PFirst Published Mar 6, 2019, 8:20 AM IST
Highlights

నాగ్ పూర్ వన్డేలో సూపర్ సెంచరీతో టీమిండియా కెప్టెన్ కోహ్లీ మరోసారి అద్భుత విజయాన్ని అందించాడు. అందరు బ్యాట్ మెన్స్ విఫలమైన పిచ్ పై కోహ్లీ ఒంటరిపోరాటం చేసి సెంచరీ సాధించాడు. ఇలా కోహ్లీ సెంచరీ చేసిన ప్రతిసారి భారత్ గెలవడం సెంటిమెంట్ గా మారింది. కొన్ని మ్యాచుల్లో మినహాయిస్తే కోహ్లీ సెంచరీ చేసిన ప్రతిసారి టీమిండియా గెలుస్తోంది. దీంతో ఇలా సెంచరీలతో అత్యధిక విజయాలను అందించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. 

నాగ్ పూర్ సెంచరీతో వన్డేల్లో కోహ్లీ ఖాతాలో 40వ సెంచరీ వచ్చి చేరింది. ఇలా అతడు సెంచరీ చేసిన 40 మ్యాచుల్లో టీమిండియా 33 సార్లు విజయం సాధించగా 7 సార్లు ఓటమిపాలయ్యింది. అయితే ఈ రికార్డు ఇప్పటివరకు సచిన్ పేరిట వుండగా కోహ్లీ సమం చేశాడు. సచిన్ 49 సెంచరీలు సాధించగా అందులో 33 మ్యాచుల్లో భారత్ విజయం సాధించింది. అయితే కోహ్లీ కేవలం 40 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించాడు.    

నాగ్‌పూర్ లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్లు విఫలమై తక్కువ పరుగులకే పెవిలియన్ కు చేరగా బ్యాటింగ్ బాధ్యతన కోహ్లీ తన భుజాలపై వేసుకున్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలోనే కోహ్లీ సెంచరీ సాధించాడు. 107 బంతుల్లో 100 పరుగులు సాధించి తన వన్డే కెరీర్లో 40వ సెంచరీని పూర్తి చేసుకుని ఒంటరి పోరాటాన్ని కొనసాగించి జట్టును విజయంలో కీలకపాత్ర పోషించాడు. 
 
click me!