ధోనిని పరుగెత్తించిన అభిమాని...ఏకంగా మైదానంలోనే (వీడియో)

Published : Mar 05, 2019, 11:09 PM ISTUpdated : Mar 06, 2019, 07:35 AM IST
ధోనిని పరుగెత్తించిన అభిమాని...ఏకంగా మైదానంలోనే (వీడియో)

సారాంశం

టీమిండియా-ఆస్ట్రేలియాల మధ్య నాగ్ పూర్ లో రెండో వన్డే జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్  సందర్భంగా విసిఏ (విదర్భ క్రికెట్ అసోసియేషన్) స్టేడియంలో టీమిండియా వికెట్ కీఫర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి వింత అనుభవం ఎదురయ్యింది. 

టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు మైదానంలోకి వస్తుండగా ఓ సరదా సంఘటన చోటుచేసుకుంది. మైదానంలోని సెక్యూరిటీని దాటుకుని ఓ అభిమాని భారత ఆటగాళ్ళ వద్దకు వచ్చాడు. అయితే అందరు ఆటగాళ్లను కాకుండా స్పెషల్  గా ధోనికి కలుసుకోడానికి ప్రయత్నిస్తూ అతడి వద్దకు పరుగెత్తాడు. 

ఈ విషయాన్ని గమనించిన ధోనీ ఆ అభిమానికి దొరక్కుండా సరదాగా మైదానంలో పరుగెత్తాడు. అయితే అభిమాని కూడా తగ్గకుండా ధోని వెంటే పరుగెత్తాడు. దీన్ని చూస్తున్న అభిమానులకు మైదానంలోని అభిమానులకు కాస్సేపే ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎట్టకేలకు స్టంప్స్ వద్ద ఆగిన ధోని అభిమానిని ఆలింగనం చేసుకున్నాడు. 

ఈ సరదా సంఘటన నెటిజన్లకు, అభిమానులకు తెగ నచ్చడంతో వైరల్ గా మారింది. ఈ వీడియోపై వారు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను కింద చూడండి. 

వీడియో

PREV
click me!

Recommended Stories

హిట్‌మ్యాన్ కాదు.. ఇకపై డాక్టర్ రోహిత్.. పూర్తి వివరాలు ఇవిగో
టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్..! దెబ్బకు రూ. 250 కోట్లు హుష్ కాకి..