పాక్ ఖాతాలో మరో చెత్త రికార్డు... అప్పుడు ఇంగ్లాండ్, ఇప్పుడు విండీస్

By Arun Kumar PFirst Published May 31, 2019, 8:21 PM IST
Highlights

ఇంగ్లాండ్ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో మన దాయాది పాక్ మొదటి మ్యాచ్ లోనే చతికిలపడింది. శుక్రవారం నాటింగ్‌హామ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో విండీస్ చేతిలో పాక్ ఘోర ఓటమిని చవిచూసింది. ముఖ్యంగా పాక్ బ్యాట్ మెన్స్‌లో ఏ ఒక్కరు రాణించకపోవడంతో కేవలం 105 పరుగులకే కుప్పకూలింది. ఇలా పాక్ ప్రపంచ కప్ చరిత్రలో రెండో అతితక్కువ స్కోరు తాజా మ్యాచ్ లో నమోదయ్యింది.  
 
1992 సంవత్సరంలో ఆస్ట్రేలియాలోని అడిలైడ్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ లో పాకిస్తాన్, ఇంగ్లాండ్ లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కూడా పాక్ దారుణంగా విఫలమై కేవలం  74 పరుగులకే ఆలౌటయ్యింది. మళ్లీ 27 ఏళ్ల తర్వాత పాక్ మరోసారి అలాంటి ఆటతీరునే కనబర్చింది. అప్పుడు ఇంగ్లాండ్  తో జరిగిన మ్యాచ్ లో  విఫలమైతే ఇప్పుడు ఇంగ్లాండ్ లో విఫలమయ్యింది. ఇవాళ విండీస్ పై సాధించిన 105 పరుగులు పాకిస్థాన్ కు ప్రపంచ కప్ లో రెండో అతితక్కువ స్కోరు. 

ఈ మ్యాచ్ ద్వారా పాక్ తన  చెత్త రికార్డును తానే బద్దలుకొట్టుకుంది. ఆస్ట్రేలియాపై లార్డ్ లో సాధించిన 132 పరుగులే ఇప్పటివరకు పాక్ రెండో అతి తక్కవ స్కోరు. ఆ రికార్డును తాజా 105 పరుగుల ఇన్సింగ్స్ బద్దలుకొట్టింది. దీంతో1999లో ఆస్ట్రేలియా పై చేసిన 132 పరుగులు మూడో స్థానంలోకి చేరింది.  

ఇవాళ జరిగిన మ్యాచ్ లో విండీస్ బౌలర్ల  దాటికి పాక్ టాప్ ఆర్డర్ తో సహా జట్టు జట్టంతా విలవిల్లాడిపోయింది. కేవలం నలుగురు ఆటగాళ్లను మినహాయిస్తే మిగతావారెవ్వరు కనీసం రెండంకెల స్కోరును కూడా  సాధించలేకపోయారు. పాక్ ఇన్నింగ్స్ లో ఫకార్ జమాన్, బాబర్ ఆజమ్ లు సాధించిన 22 పరుగులే హయ్యెస్ట్ స్కోర్. చివర్లో వాహబ్ రియాజ్ 11 బంతుల్లో 18 పరుగులు కాస్త దాటిగా ఆడటంతో కనీసం పాక్ స్కోరు సెంచరీ మార్కును దాటగలిగింది.  ఇదే ఆటతీరు కొనసాగిస్తే పాక్ ప్రపంచ కప్ నుండి వెనుదిరిగే మొదటి జట్టుగా నిలుస్తుంది. 

click me!