పాకిస్తాన్ పై చెలరేగిన గేల్...ప్రపంచ కప్ లో అరుదైన రికార్డ్

By Arun Kumar PFirst Published May 31, 2019, 7:29 PM IST
Highlights

ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా నాటింగ్ హామ్ లో జరిగిన రెండో వన్డేలో విండీస్ అదరగొట్టాడు. బౌలర్ల విజృంభణతో కేవలం 105 పరగులకే పాక్ ను కుప్పకూల్చిన విండీస్ బ్యాటింగ్ లోనే ఆధిపత్యం కొనసాగించింది.  ఓపెనర్  క్రిస్ గేల్ చెలరేగి ఆడుతూ కేవలం 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు మూడు సిక్సర్లు బాది ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. 
 
ప్రపంచ కప్ లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ గా డివిలియర్స్ నిలిచాడు. అతడు ప్రపంచ కప్ టోర్నీలో 37 సిక్సర్లు కొట్టాడు. అయితే తాజా ఇన్సింగ్స్ ద్వారా గేల్ ఈ రికార్డును బద్దలుగొట్టాడు. ఈ హాఫ్ సెంచరీ సాధించే క్రమంలో బాదిన మూడు సిక్సర్లతో కలిపి గేల్  ఖాతాలోకి 39 సిక్సర్లు చేరాయి. ఇలా ప్రపంచ  కప్ మ్యాచుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ గా గేల్ రికార్డు నెలకొల్పాడు. 

ఓవరాల్ గా వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు పాక్ మాజీ  క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ పేరిట వుంది. అతడి ఖాతాలో 351 సిక్సర్లుండగా, గేల్ ఖాతాలో 317 సిక్సర్లున్నాయి. అయితే ఇప్పటికే  అఫ్రీది క్రికెట్ నుండి వైదొలిగాడు. కాబట్టి వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డును కూడా గేల్ బద్దలుగొట్టే అవకాశాలున్నాయి. 

అలాగే ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక సిక్సర్ల రికార్డుకు దరిదాపుల్లో కూడా ప్రస్తుతం ఏ ఆటగాడు లేడు. డివిలియర్స్ తో పాటు రికీపాంటింగ్(31 సిక్సర్లు), మెక్ కల్లమ్ (29 సిక్సర్లు) తర్వాతి స్థానాల్లో నిలిచారు. వీరందరు కూడా ఇప్పటికే రిటైరవడంతో గేల్ రికార్డుకు మరికొన్నేళ్లు ధోఖా లేదు. అంతేకాకుండా  ఈ టోర్నీ ఇంకా ఆరంభ దశలోనే వుంది కాబట్టి గేల్ ఖాతాలో మరిన్ని బౌండరీలు చేరే అవకాశం వుంది.  ఇలా ప్రపంచ కప్ లో అతడి సిక్సర్ల సంఖ్య హాఫ్ సెంచరీని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు.  

click me!