ప్రపంచ కప్ 2019: కోహ్లీ కొత్తగా ప్రాక్టీస్... అభిమానుల సరదా కామెంట్స్ (వీడియో)

By Arun Kumar PFirst Published May 31, 2019, 3:43 PM IST
Highlights

ప్రపంచ కప్ మెగా టోర్నీకి తెరలేచింది. దీంతో ఇప్పిటికే సౌతాంప్టన్ కు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ లో మునిగిపోయింది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న టీమిండియాను గెలిపించడానికి ఆటగాళ్లు శక్తివంచన  లేకుండా కష్టపడుతున్నారు. అయితే టీమిండియా చేపట్టిన ఈ ప్రాక్టీస్ సెషన్లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. ఇప్పిటికే అత్యుత్తమ బ్యాట్ మెన్ గా రాణిస్తూ ఎన్నో రికార్డులను బద్దలుగొట్టిన కెప్టెన్ విరాట్ కోహ్లీ  బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దీంతో  ఏమీ అర్థంకాక ఆశ్చర్యపోవడం అందరి వంతయ్యింది. 

నెట్స్ లో కోహ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను బిసిసిఐ అధికారిక ట్విట్టర్ ద్వారా విడుదలచేసింది. ఏదో సరదాగా అన్నట్లు కాకుండా  కోహ్లీ చాలా సీరియస్ గా బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం ఆ వీడియోలో కనిపిస్తోంది. దీంతో ఈ  వీడియో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతూ వైరల్ గా మారింది. 

బ్యాట్ మెన్ గా ఇప్పటికే  తానేంటో నిరూపించుకున్న కోహ్లీ జట్టుకు అవసరమైతే బౌలింగ్ చేయడానికి కూడా సిద్దంగా వుండాలనే ఇలా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో గెలుపు కోసం ఎలాంటి అవకాశశం వదులుకోవద్దని కెప్టెన్ కోహ్లీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందువల్లే అతడు నెట్స్ బౌలింగ్ సాధన చేస్తూ కొత్త అవవతారమెత్తాడు. అత్యవసరమైతే తప్ప అతడు బౌలింగ్ చేసే అవకాశం వుండకపోవచ్చు. 

అయితే కోహ్లీ ఇదివరకు కూడా కొన్నిసార్లు బంతి  పట్టిన సందర్భాలున్నాయి. ఇప్పటివరకు మొత్తం 228 వన్డే మ్యాచ్‌లాడిన కోహ్లీ 48సార్లు బౌలింగ్‌ చేశాడు. ఇలా అతడి  ఖాతాలో నాలుగు వికెట్లు కూడా వున్నాయి.  

తాజా కోహ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ పై అభిమానుల సరదా  కామెంట్స్ చేస్తున్నారు. '' కెప్టెన్,, బ్యాట్ మెన్, ఫీల్డర్ గా  ఇప్పటికే నిరూపించుకున్న కోహ్లీ కొత్తగా బౌలర్ అవతారమెత్తడానికి సిద్దమయ్యాడు'', '' ప్రపంచ  కప్ లో టీమిండియాకు మరోో ఫేసర్ దొరికాడు'' అంటూ ఇలా వివిధ రకాలేగా కామెంట్ చేస్తున్నారు.

A little warm-up before hitting the nets for Skipper . pic.twitter.com/OlwbKq0czD

— BCCI (@BCCI)

click me!