ధోనీ కూతురు కూడా వచ్చేసింది... నాలుగేళ్ల వయసులోనే తండ్రితో కలిసి జీవా ధోనీ క్యూట్...

Published : Jan 05, 2021, 01:18 PM IST
ధోనీ కూతురు కూడా వచ్చేసింది... నాలుగేళ్ల వయసులోనే తండ్రితో కలిసి జీవా ధోనీ క్యూట్...

సారాంశం

తండ్రితో కలిసి ‘ఓరియో’ బిస్కెట్ యాడ్‌లో నటించిన జీవా ధోనీ... నాలుగేళ్ల వయసులోనే క్యూట్ క్యూట్ మాటలతో అభిమానులను ఫిదా...  

బీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్న క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కడు. ‘తలైవా’, ‘తలా’, ‘మిస్టర్ కూల్’, ‘కెప్టెన్ కూల్’, ‘బెస్ట్ ఫినిషర్’... ఇలా అభిమానులతో ఎన్నో బిరుదులు అందుకున్న మహేంద్ర సింగ్ ధోనీ... ఎన్నో బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా వ్యవహారిస్తున్నాడు.

హీరోయిన్లతో, సహచర క్రికెటర్లతో కలిసి యాడ్స్ చేసిన ధోనీ... ఓ వ్యాపార ప్రకటనలో భార్య సాక్షి సింగ్‌తో కలిసి నటించాడు. ఇప్పుడు కూతురు జీవా ధోనీ కూడా బ్రాండ్ అంబాసిడర్‌ అవతారం ఎత్తేసింది.

నాలుగేళ్ల జీవా సింగ్ ధోనీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. నాలుగేళ్ల వయసులోనే జీవాకి ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. క్యూట్ క్యూట్ ఫోటోలతో తండ్రితో కలిసి అల్లరి చేసే జీవా... ఇప్పుడు మాహీతో కలిసి ఓ యాడ్‌లో నటించింది.

కాస్త బొద్దుగా, ముద్దు ముద్దు మాటలతో ‘ఓరియో’ బిస్కెట్ యాడ్‌లో నటించింది ధోనీ వారసురాలు. క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఫోన్‌కి తక్కువగా, జీవాకి ఎక్కువ సమయం కేటాయిస్తానని ఈ యాడ్‌లో చెప్పాడు ధోనీ. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు