కేక పుట్టిస్తున్న కేన్ మామ... పాక్‌పై రెండో టెస్టులో డబుల్ సెంచరీ బాదిన కేన్ విలియంసన్...

Published : Jan 05, 2021, 10:01 AM IST
కేక పుట్టిస్తున్న కేన్ మామ... పాక్‌పై రెండో టెస్టులో డబుల్ సెంచరీ బాదిన కేన్ విలియంసన్...

సారాంశం

పాక్‌తో రెండో టెస్టులో డబుల్ సెంచరీ బాదిన కేన్ విలియంసన్.. టెస్టుల్లో నాలుగో డబుల్ సెంచరీ నమోదు... టెస్టుల్లో 7 వేల పరుగులు పూర్తిచేసుకున్న కేన్ విలియంసన్... 

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్... తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. నెల రోజుల కిందట వెస్టిండీస్‌పై 251 పరుగులు చేసిన కేన్ విలియంసన్, పాకిస్థాన్‌తో జరిగిన మొదటి టెస్టులో సెంచరీ చేశాడు. రెండో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు కేన్ విలియంసన్.

టెస్టుల్లో నాలుగో డబుల్ సెంచరీ బాదిన కేన్ విలియంసన్, అత్యధిక ద్విశతకాలు బాదిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్ రికార్డును సమం చేశాడు. 

అలాగే టెస్టుల్లో 7 వేల పరుగులు పూర్తిచేసుకున్న మూడో కివీస్ క్రికెటర్‌గా నిలిచాడు కేన్ విలియంసన్.  364 బంతుల్లో 28 ఫోర్లతో 238 పరుగులు చేసిన కేన్ విలియంసన్, అస్రఫ్ బౌలింగ్‌లో మసూద్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.  

కేన్ విలియంసన్ అవుట్ అయ్యే సమయానికి పాక్‌పై 288 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది న్యూజిలాండ్. హెన్రీ నికోలస్ 157 పరుగులు చేసి అవుట్ కాగా మిచెల్ 62 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు