టీమిండియాకు భారీ షాక్... గాయంతో టెస్టు సిరీస్‌కి కెఎల్ రాహుల్ దూరం...

Published : Jan 05, 2021, 09:47 AM ISTUpdated : Jan 05, 2021, 09:48 AM IST
టీమిండియాకు భారీ షాక్... గాయంతో టెస్టు సిరీస్‌కి కెఎల్ రాహుల్ దూరం...

సారాంశం

నెట్ ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడిన కెఎల్ రాహుల్... చివరి రెండు టెస్టులకు దూరమైన స్టార్ బ్యాట్స్‌మెన్...  

మూడో టెస్టు ఆరంభానికి ముందు భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా మిగిలిన రెండు టెస్టుల నుంచి కెఎల్ రాహుల్ దూరమయ్యాడు. మొదటి రెండు టెస్టుల్లో బరిలో దిగని కెఎల్ రాహుల్‌ను, చివరి రెండు టెస్టుల్లో ఆడించాలని భావించింది టీమిండియా.

అయితే మెల్‌బోర్న్‌లో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గాయపడిన కెఎల్ రాహుల్, మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. కెఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకోవడానికి మూడు వారాల విశ్రాంతి అవసరమని సూచించాడు భారత ఫిజియో..

గాయంతో స్వదేశానికి బయలుదేరిన కెఎల్ రాహుల్, బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటాడని బీసీసీఐ సెక్రటరీ జే షా మీడియాకు ప్రకటన ద్వారా తెలియచేశారు. కెఎల్ రాహుల్ గాయంతో స్వదేశానికి బయలుదేరడంతో హనుమ విహారి, మయాంక్ అగర్వాల్‌లలో ఒకరికి మూడో టెస్టులో మరో అవకాశం దక్కనుంది.

PREV
click me!

Recommended Stories

Virat Kohli : సచిన్, పాంటింగ్ లకు షాకిచ్చిన విరాట్ కోహ్లీ.. సూపర్ రికార్డు !
Shreyas Iyer : 10 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరుపులు.. అయ్యర్ వస్తే అదిరిపోవాల్సేందే మరి !