ఆ ఇద్దరి నిజాయితీ.. కారులో దొరికిన రూ.4వేలు రిషభ్ పంత్ కు తిరిగిచ్చేశారు..

Published : Jan 03, 2023, 10:30 AM IST
ఆ ఇద్దరి నిజాయితీ.. కారులో దొరికిన రూ.4వేలు రిషభ్ పంత్ కు తిరిగిచ్చేశారు..

సారాంశం

యాక్సిడెంట్ సమయంలో రిషభ్ పంత్ కారులో దొరికిన నాలుగువేళ రూపాయలను ఇద్దరు యువకులు పంత్ కు తిరిగి ఇచ్చేశారు. దీంతో వీరి నిజాయితీకి ప్రశంసల జల్లు కురుస్తోంది. 

డిసెంబర్ 30న ఇండియన్ స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ కు రోడ్ యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఇద్దరు యువకులు తమ నిజాయితీని చాటుకున్నారు. వారి నిజాయితీతో అందరూ వారి మీద పరశంసల జల్లు కురిపిస్తున్నారు. రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో అతడికి రజత్ కుమార్, నిషు కుమార్ అనే ఇద్దరు యువకులు సహాయం చేశారు. 

రిషభ్ కారు మంటల్లో కాలిపోతున్న సమయంలో రిషభ్ పంత్ వస్తువులు, నగదు వీరిద్దరే బయటకు తీశారు. అయితే, కారులో నుంచి ఆ సమయంలో కారులోనుంచి తీసిన రూ.4వేలను పోలీసులకు అందించారు. వారి నిజాయితీకి పోలీసులు వారిని అభినందించారు. ఈ విషయం బైటికి రావడంతో ఈ ఇద్దరి చేసిన పనిని అందరూ ప్రశంసిస్తున్నారు. యాక్సిడెంట్ తరువాత రిషభ్ పంత్ మ్యాక్స్ హాస్సిటల్ లో చికిత్స పొందుతున్నారు. వీరిద్దరు రిషభ్ ను కలిసి పరామర్శించారు. 

పంత్‌ను కాపాడిన డ్రైవర్, కండక్టర్‌‌ను సత్కరిస్తాం.. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !