ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్.... పంత్ స్థానంలో ఆంధ్రా కుర్రాడు..!

By telugu news teamFirst Published Jan 3, 2023, 9:40 AM IST
Highlights

భరత్ భారత జట్టుకి చాలా సార్లు ఎంపిక అవుతూనే ఉన్నా... కేవలం బ్యాకప్ వికెట్ కీపర్ గా మాత్రమే ఉండిపోతున్నాడు. 

టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా... ఈ ప్రమాదం కారణంగా... పంత్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ సిరీస్ కి దూరం కావాల్సి వస్తోంది. దీంతో... ఆ స్థానంలో ఆంధ్రా కుర్రాడు కోన శ్రీకర్ భరత్ కి స్థానం దక్కనుందని తెలుస్తోంది.

ఆస్ట్రేలియా సిరీస్ సమయానికి సిద్ధంగా ఉండాలని కోన శ్రీకర్ భరత్ కి బీసీసీఐ ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది. దీంతో... వారి కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కాగా.... భరత్ భారత జట్టుకి చాలా సార్లు ఎంపిక అవుతూనే ఉన్నా... కేవలం బ్యాకప్ వికెట్ కీపర్ గా మాత్రమే ఉండిపోతున్నాడు. 2021లో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో భరత్ కి తొలిసారిగా భారత్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే... తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. కానీ రెండో టెస్టులో సబ్ స్టిట్యూట్ గా వచ్చిన భరత్.. తన వికెట్ కీపింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు.

అదేవిధంగా ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు సిరీస్ లోనూ భరత్ కి చోటు దక్కింది. కానీ రెండు మ్యాచ్ ల్లోనూ బెంచ్ కే పరిమితమయ్యాడు. కాగా... ఈ సారి మాత్రం పంత్ కి ప్రమాదం జరగడంతో..దేశం తరపున ఆడే అవకాశం వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. 

click me!