లక్ష్యం లంకతో ప్రారంభం.. రేపటి నుంచే శ్రీలంకతో టీ20 సిరీస్.. షెడ్యూల్, ఇతర వివరాలివే..

By Srinivas MFirst Published Jan 2, 2023, 6:02 PM IST
Highlights

INDvsSL T20I:  ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్, వచ్చే ఏడాది జరుగబోయే  టీ20 ప్రపంచకప్ కోసం  భారత్ ఇప్పట్నుంచే సన్నాహకాలు మొదలుపెట్టనుంది. ఇందులో భాగంగానే  హార్ధిక్ సారథ్యంలోని టీమిండియా.. రేపట్నుంచి శ్రీలంకతో  మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ మొదలుపెట్టనుంది.  
 

గతేడాది భారత జట్టుకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి.   ద్వైపాక్షిక సిరీస్ లలో ఫర్వాలేదనిపించినా  కీలక టోర్నీలలో భారత్ చతికిలపడింది.  ఈ ఏడాది (2023) లో  కూడా  భారత్ ముంగిట కీలక సిరీస్ లు ఉన్నాయి. అన్నింటికీ మించి ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్, వచ్చే ఏడాది జరుగబోయే  టీ20 ప్రపంచకప్ కోసం  భారత్ ఇప్పట్నుంచే సన్నాహకాలు మొదలుపెట్టనుంది. ఇందులో భాగంగానే పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్ మార్పు (?) కూడా జరిగిందనే వార్తలూ వినిపిస్తున్నాయి.  వయసు,  ఇతర కారణాల రీత్యా  రోహిత్ ను పక్కనబెట్టి హార్ధిక్ పాండ్యాను  అధికారికంగా ప్రకటించడమే తరువాయి  అని  గుసగుసలు వినిపిస్తున్నాయి.   ఇందులో భాగంగానే హార్ధిక్ సారథ్యంలోని టీమిండియా.. రేపట్నుంచి శ్రీలంకతో  మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ మొదలుపెట్టనుంది.  

స్వదేశంలో శ్రీలంకతో  భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.  పర్యటనలో లంక ముందు.. టీమిండియాతో పొట్టి ఫార్మాట్ లో  పోటీ పడనుంది.  ఈ సిరీస్ తోనే భారత్.. కొత్త ఏడాదిని ప్రారంభించనున్నది.  ఇందుకు సంబంధించిన షెడ్యూల్, ఇతర వివరాలు ఇక్కడ చూద్దాం. 

టీ20 సిరీస్ షెడ్యూల్ : 

- జనవరి 3 : తొలి టీ20 - వాంఖడే స్టేడియం, ముంబై 
- జనవరి5 : రెండో టీ20 - మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం, పూణే 
- జనవరి 7 : మూడో టీ20 -  రాజ్‌కోట్  

- మ్యాచ్‌లన్నీ రాత్రి  ఏడు గంటలకు ప్రారంభమవుతాయి. 

వన్డే సిరీస్ షెడ్యూల్ : 

- జనవరి 10 : తొలి వన్డే - గువహతి 
- జనవరి 12 : రెండో వన్డే - కోల్‌‌కతా 
- జనవరి 15 : మూడో వన్డే - తిరువనంతపురం 

- మ్యాచ్‌లన్నీ  మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలవుతాయి. 

ఇలా చూడొచ్చు.. 

- బీసీసీఐ అధికారిక ప్రసారదారు  స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.  స్టార్ నెట్వర్క్ లోని స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానెళ్లలో లైవ్ చూడొచ్చు.  
- డిస్నీ + హాట్ స్టార్ లలో కూడా మ్యాచ్ లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. 

 

Fantastic five 😎
All set for the T20I series 🇮🇳 | pic.twitter.com/pAWq28wkF7

— Yuzvendra Chahal (@yuzi_chahal)

టీ20లకు భారత్ జట్టు :  హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్,  సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, ముకేశ్ కుమార్ 

వన్డేలకు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ 

భారత్ తో వన్డే సిరీస్ కు  లంక జట్టు : దసున్ శకన (కెప్టెన్), కుశాల్ మెండిస్, పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వ, వనిందు హసరంగ, అషేన్ బండార, మహీష్ తీక్షణ, జెఫ్రీ  వండర్సే, చమీక కరుణరత్నె, దిల్షాన్ మధుశనక, కసున్ రజిత, నువానిదు ఫెర్నాండో, దునిత్ వెల్లలగె, ప్రమోద్ మధుషాన్, లాహిరు కుమార 

టీ20లకు : దసున్ శనక (కెప్టెన్), వనిందు హసరంగ,  పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ,  కుశాల్ మెండిస్, భానుక రాజపక్స, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, అషేన్ బండార, మహీశ్ తీక్షణ, చమీక కరుణరత్నె, దిల్షాన్ మధుశనక, కసున్ రజిత, దునిత్ వెల్లలగె, ప్రమోద్ మధుషాన్, లాహిరు కుమార, నువాన్ తుషారా

click me!