నా పీక మీద కత్తి పెట్టాడు.. పాక్ మాజీ కోచ్ షాకింగ్ కామెంట్స్

Published : Jul 03, 2020, 07:59 AM ISTUpdated : Jul 03, 2020, 08:14 AM IST
నా పీక మీద కత్తి పెట్టాడు.. పాక్ మాజీ కోచ్ షాకింగ్ కామెంట్స్

సారాంశం

 యూనిస్‌కు బ్యాటింగ్‌లో సలహా ఇస్తుంటే... అది అతనికి నచ్చలేదేమో ఏకంగా నా పీకపై కత్తి పెట్టేశాడు. మా పక్కనే ఉన్న మికీ ఆర్థర్‌ కలగజేసుకొని సముదాయించారు.

పాక్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ పై ఆ జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ సంచలన ఆరోపణలు చేశాడు. యూనిస్ కి సలహా ఇవ్వబోతే తన పీక మీద కత్తి పెట్టాడని ఆయన పేర్కొన్నారు.

‘పాక్‌ జట్టు తరఫున ఆసీస్‌ పర్యటనలో ఉండగా ఓ సంఘటన నన్ను బాగా కలవరపెట్టింది. బ్రిస్బేన్‌ టెస్టు సందర్భంగా నేను యూనిస్‌కు బ్యాటింగ్‌లో సలహా ఇస్తుంటే... అది అతనికి నచ్చలేదేమో ఏకంగా నా పీకపై కత్తి పెట్టేశాడు. మా పక్కనే ఉన్న మికీ ఆర్థర్‌ కలగజేసుకొని సముదాయించారు. ఈ సంఘటనతో నేను ఒక్కసారిగా షాకయ్యాను". కానీ కోచ్‌గా ఇదంతా నా ప్రయాణంలో భాగమే అనుకొని సరిపెట్టుకున్నాను’ అని అన్నాడు. 

జింబాబ్వేకు చెందిన ఫ్లవర్‌కు 2016లో ఆస్ట్రేలియా టూర్‌లో ఈ అనుభవం ఎదురైంది. ఇతను 2015 నుంచి 2019 వరకు పాక్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. దీనిపై 42 ఏళ్ల మాజీ కెప్టెన్‌ యూనిస్‌ స్పందించలేదు.

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !