క్రికెట్ లో అనేక అద్బుతాలు చూస్తుంటాం. సిక్స్ గా వెళ్లే బంతిని ఫీల్డర్ అడ్డుకోవడమే కాదు ఓ బ్యాటర్ రనౌట్ కు కారణమయ్యాడు. ఈ ఘటన నేపాల్, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగింది.
ఖాట్మాండ్: సిక్స్ గా వెళ్లే బంతిని అడ్డుకోవడంతో పాటు బ్యాటర్ ను రనౌట్ చేసిన అంశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.నేపాల్, నెదర్లాండ్స్ మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. నేపాల్ క్రికెట్ జట్టు ఆరు వికెట్ల తేడాతో నెదర్లాండ్స్ ను ఓడించింది.నెదర్లాండ్స్ ను 120 పరుగులకే నేపాల్ కట్టడి చేసింది.
also read:ఆర్ధిక ఇబ్బందులు: రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు పిల్లలను చంపి తండ్రి సూసైడ్
దీపేందర్ సింగ్ ఐరి వేసిన పుల్ టాస్ డెలివరీపై రోలోఫ్ వాన్ డెర్ మెర్వే లాంగ్ ఆన్ వైపు షాట్ ఆడాడు.అయితే ఈ బంతి సిక్స్ వెళ్తుందని అంతా భావించారు. అయితే భుర్టెల్ తన అద్భుతమైన ఫీల్డింగ్ తో ఈ బంతిని బౌండరీ లైన్ దాటకుండా ఆపాడు.
also read:అదే కొంపముంచింది: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కేసీఆర్
Turning a certain six into a wicket. pic.twitter.com/JGl7IT07jP
— Bertus de Jong (@BdJcricket)ఈ బంతిని బౌండరీ లైన్ దాటకుండా ఆపడంలో అతను విజయం సాధించాడు. వెంటనే భ్రుతేల్ బంతిని వికెట్ కీపర్ వైపు విసిరాడు. కింగ్మా క్రీజ్ నుండి బయటకు వెళ్లిన విషయాన్ని గుర్తించి స్టంప్ లను పడగొట్టాడు వికెట్ కీపర్. దీంతో నెదర్లాండ్స్ జట్టు 19.3 పరుగులకే 120 పరుగులకు అలౌటైంది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.