WPL 2024, RCB vs MI: మరోసారి భంగపడ్డ బెంగుళూర్.. ముందంజలో ముంబై.. 

By Rajesh Karampoori  |  First Published Mar 3, 2024, 12:33 AM IST

WPL 2024, RCB vs MI: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా శనివారం జరిగిన 9వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ఈ మ్యాచ్‌లోనూ ముంబై జట్టు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ లేకుండానే బరిలోకి దిగింది. అయినా.. నాట్ సీవర్ బ్రంట్ కెప్టెన్సీలో జట్టు అద్భుతంగా ఆడి,ఈ సీజన్‌లో మూడవ విజయాన్ని అందుకుంది.ఈ విజయంతో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ అగ్రస్థానానికి చేరుకుంది.


WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 29 బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో ఆర్‌సీబీని ఓడించి విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీపై ముంబైకి ఇదే తొలి విజయం. గత సీజన్‌లో ముంబై రెండుసార్లు ఆర్‌సీబీని ఓడించింది. అదే సమయంలో ఈ సీజన్‌లో RCBకి ఇది రెండో ఓటమి.  ఆర్‌సీబీ నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబైకి శుభారంభం లభించింది.

ముంబాయి ఓపెనర్లు యాస్టికా భాటియా, హేలీ మాథ్యూస్ లు తొలి వికెట్‌కు 23 బంతుల్లో 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 15 బంతుల్లో 31 పరుగులు చేసి భాటియా ఔటయ్యారు. ఆ తరువాత హేలీ 26 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నారు. ఆర్‌సీబీపై ముంబై బ్యాట్స్‌మెన్స్ అద్భుతంగా ఉంది. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ నేట్ సివర్ బ్రంట్ దూకుడుగా ఆడారు. నాలుగు ఫోర్ల సాయంతో 27 పరుగులు చేశాడు. ఆమె మోలినెక్స్ చేతిలో ఔట్ అయ్యాడు.

Latest Videos

ఆ తర్వాత వచ్చిన అమేలియా విధ్వంసం స్రుష్టించారు. కేవలం 24 బంతుల్లో 40 చేసి అజేయంగా నిలిచారు. దీంతో 15.1 ఓవర్లలో 29 బంతులు మిగిలి ఉండగానే జట్టు సాధించింది. ఆర్‌సీబీ తరఫున సోఫీ డివైన్, జార్జియా వేర్‌హామ్, శ్రేయాంక పాటిల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

తొలుత బ్యాటింగ్ చేసిన స్మృతి మంధాన నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 131 పరుగులకే పరిమితమైంది. ముంబై ఇన్నింగ్స్ లో అలిస్ పెర్రీ, జార్జియా వేర్‌హామ్ మాత్రమే రాణించారు. వారు 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.మిగితా వాళ్లు అంతగా ఆడలేకపోయారు. కెప్టెన్ స్మృతి మంధాన కూడా కేవలం తొమ్మిది పరుగులకే వెనుదిరగాల్సి వచ్చింది. మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన తెలుగమ్మాయి కూడా ఈ మ్యాచ్ లో రాణించాలేకపోయారు కేవలం 11 పరుగులు చేయగల్గింది. ముంబై తరఫున నేట్ సివర్ బ్రంట్, పూజా వస్త్రాకర్ రెండేసి వికెట్లు తీయగా.. ఇసి వాంగ్‌, సైకా ఇషాక్‌లు చెరో వికెట్ సాధించారు. 

 పాయింట్ల పట్టికలో పెను మార్పు 

ముంబై అద్భుత విజయంతో పాయింట్ల పట్టికలో పెద్ద మార్పు చేసింది. ఆ జట్టు ఆరు పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. అదే సమయంలో ఆర్సీబీ నాలుగో స్థానానికి చేరుకుంది. జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు రన్ రేట్ -0.015గా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు పాయింట్లు, 1.271 నెట్ రన్ రేట్‌తో రెండో స్థానంలో నిలువగా .. యుపి వారియర్స్ నాలుగు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. అదే సమయంలో ఒక్క మ్యాచ్ కూడా గెలవని గుజరాత్ జెయింట్స్ ఐదో స్థానంలో సిర్థపడింది.

click me!