WPL: గుజరాత్ సారథికి గాయం.. యూపీతో నేటి మ్యాచ్‌కు కెప్టెన్ ఆమేనా..?

Published : Mar 05, 2023, 01:35 PM IST
WPL: గుజరాత్ సారథికి గాయం.. యూపీతో నేటి మ్యాచ్‌కు కెప్టెన్ ఆమేనా..?

సారాంశం

WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)  తొలి సీజన్ లో  ఆడిన  మొదటి మ్యాచ్ లోనే ముంబై చేతిలో దారుణ  ఓటమిపాలైన గుజరాత్  జెయింట్స్ కు మరో భారీ షాక్ తగిలింది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ జెయింట్స్ కు వరుస షాకులు తాకుతున్నాయి.  ముంబై ఇండియన్స్ తో తొలి మ్యాచ్ కు ముందే ఆ జట్టు  ఆల్ రౌండర్  డియోండ్రా డాటిన్ దూరం కాగా  నిన్నటి మ్యాచ్ లో గుజరాత్  అన్ని విభాగాల్లో విఫలైమ 143 పరుగుల భారీ తేడాతో ఓడింది. ఇప్పుడు తాజాగా ఆ జట్టు సారథి  బెత్ మూనీ   నేడు  యూపీతో జరుగబోయే మ్యాచ్ కు అందుబాటులో ఉండేది  అనుమానమే.. 

ముంబైతో మ్యాచ్ లో  ఛేదనలో  భాగంగా క్రీజులోకి వచ్చిన  మూనీ..  సీవర్ వేసిన నాలుగో బంతికి సింగిల్ తీయాలని భావించినా ఆమె కాలు బెనకడంతో అక్కడే ఆగిపోయింది. నొప్పి వేధించడంతో ఆమె  రిటైర్డ్ హార్ట్ గా పెవిలియన్ చేరింది. తర్వాత  మ్యాచ్ ముగిసినా ఆమె క్రీజులోకి రాలేదు. 

గుజరాత్ జెయింట్స్ కు మూనీ కీలక బ్యాటర్. ఆమె రిటైర్డ్ హార్ట్ అయిన వెంటనే గుజరాత్ బ్యాటర్స్ అంతా అలా వచ్చి ఇలా వెళ్లారు. ఒక్క హేమలత మినహా టాప్ ఆల్  రౌండర్లు   ఆష్లే గార్డ్‌నర్,  సదర్లాండ్,  వెర్హమ్ లతో పాటు  హర్లీన్ డియోల్ కూడా దారుణంగా విఫలమైంది. అందుకు గుజరాత్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. 

ఇదిలాఉండగా గాయం ఇంకా వేధిస్తుండటంతో  మూనీ  నేడు రాత్రి యూపీ వారియర్స్ తో  జరుగబోయే మ్యాచ్ కు అందుబాటులో ఉండటం లేదని సమాచారం. ఆమెకు నొప్పి ఇంకా వేధిస్తున్నదని..  నేటి మ్యాచ్  ఆడటం కష్టమేనని గుజరాత్ టీమ్ వర్గాలు కూడా చెబుతున్నాయి.  మూనీ  అందుబాటులో లేనిపక్షంలో నేటి మ్యాచ్ లో   భారత  ఆల్ రౌండర్  స్నేహ్ రాణాను సారథిగా  నియమించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.  

 

తొలి  మ్యాచ్ లో దారుణంగా ఓడి డీలా పడిపోయిన గుజరాత్ ఈ మ్యాచ్ లో గెలిచి  మళ్లీ పుంజుకోవాలని చూస్తున్నది.  నేటి మ్యాచ్ లో కూడా ఫలితం తేడా కొడితే  గుజరాత్ కు రాబోయే  మ్యాచ్ లలో కూడా  భారీ షాకులు తప్పవు.  

కాగా నేడు యూపీ  - గుజరాత్ కంటే ముందు  స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మెగ్ లానింగ్ కెప్టెన్సీలోని  ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది.  నేటి మధ్యాహ్నం  3.30 గంటలకు  ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. డబ్ల్యూపీఎల్ లో ముంబై మాదిరిగానే తొలి మ్యాచ్ లో కూడా  భారీ విజయం సాధించాలని  ఆర్సీబీతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తున్నాయి. రాత్రి 7.30 గంటలకు యూపీ - గుజరాత్ మ్యాచ్.. డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. 

 

 

PREV
click me!

Recommended Stories

5 Wickets in 1 Over : W, W, W, W, W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ కొత్త చరిత్ర
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !