ప్రపంచ కప్ ఫైనల్ పిచ్చెక్కించింది...కానీ ఫలితాన్ని వేలెత్తి చూపలేను: మోర్గాన్

By Arun Kumar PFirst Published Jul 24, 2019, 3:40 PM IST
Highlights

ఇంగ్లాండ్ రాజధాని లండన్ లోని లార్డ్స్ మైదానంలో ఉత్కంఠభరితంగా సాగిన ప్రపంచ  కప్ ఫైనల్ గురించి ఇగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మరోసారి స్పందించాడు. ఈ  మ్యాచ్ ఒత్తిడి కారణంగా తనకు పిచ్చెక్కినట్లు అనిపించిందని పేర్కొన్నాడు. అయితే ఈ  మ్యాచ్ ఎలా సాగినా ఫలితాన్ని మాత్రం వేలెత్తి చూపలేమని మోర్గాన్ తెెలిపాడు.     

స్వదేశంలో జరిగిన ఐసిసి వన్డే ప్రపంచ కప్ ద్వారా ఇంగ్లాండ్ జట్టు తన చిరకాల కోరికను పూర్తిచేసుకుంది. క్రికెట్ కు పుట్టినిళ్లయిన తాము ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ ట్రోఫీని అందుకోలేపోయామనే వెలితి ఆ జట్టులో వుండేది. అలా ఇన్నాళ్లు అందని ద్రాక్షలా వున్న వరల్డ్ కప్ ట్రోఫిని 2019 టోర్నీలో అందుకోగలిగింది. అయితే దశాబ్దాల నాటి కల నెరవేరి విశ్వవేజేతగా నిలిచినప్పటికి ఆ స్థాయి ఆనందం ఆ జట్టులో కనిపించడం లేదు. ఇందుకు కారణం నాటకీయ పరిణామాల  మధ్య పైనల్లో గెలవడమే. 

లండన్ లోని లార్డ్స్ మైదానంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ గురించి ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్ స్పందించాడు. ''ఈ మ్యాచ్ తమతో న్యూజిలాండ్ అద్భుతంగా పోటీనిచ్చింది. కీలకమైన మ్యాచ్ కావడంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా పోరాడాయి. అయితే మ్యాచ్ వివిధ మలుపులు తెరిగి ఐసిసి నిబంధనలను అనుసరించి తాము విజేతలుగా నిలిచాం. 

అయితే మ్యాచ్ జరిగిన విధానం...చోటు చేసుకున్న సంఘటనలు ఎలా వున్న ఫలితాన్ని వేలెత్తి చూపలేం. బయటి నుండి చూసేవారికి ఈ మ్యాచ్ లో జరిగిన సంఘటనల గురించి విమర్శిస్తున్నారు. కానీ మైదానంలో వున్న తమకు మాత్రమే ఏ పరిస్థితుల్లో ఏం జరిగిందో తెలిసింది. ఈ సమయంలో అత్యంత ఒత్తిడి కారణంగా  పిచ్చెక్కినట్లు అనిపించింది.  అయితే తమతో సమఉజ్జీగా నిలిచిన  కివీస్ ఓడటం కాస్త బాధించింది. ఒకవేళ తాము ఓడిపోయి వుంటే ఆ బాధ ఎలా వుండేదో కూడా ఊహించుకోలేకపోతున్నా.'' అని మోర్గాన్ వెల్లడించాడు.

ఈ ప్రపంచ కప్ ఫైనల్లో భాగంగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ ఆసాంతం నరాలు తెగే ఉత్కంఠతో సాగింది. మొదట ఇరు జట్లు సమానంగా పరుగులు సాధించడంతో మ్యాచ్ టై అయ్యింది. ఆ తర్వాత ఫలితాన్ని నిర్ధారించడానికి నిర్వహించిన సూపర్ ఓవర్లో కూడా ఇరు జట్లు సమానంగా పరుగులు సాధించడంతో అది కూడా టై అయ్యింది. దీంతో ఐసిసి నిబంధనలను అనుసరించి మ్యాచ్ లో అత్యధిక బౌండరీలు బాదిన ఇంగ్లాండ్ జట్టు విశ్వవిజేతగా అవతరించింది. ఇలా బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. 

click me!