నా అభిమానులు కూడా విలియమ్సన్ కే మద్దతివ్వండి: ఇంగ్లాండ్ ప్లేయర్ స్టోక్స్

By Arun Kumar PFirst Published Jul 24, 2019, 2:51 PM IST
Highlights

''న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్'' అవార్డుకు తాను కూడా నామినేట్ అయినప్పటికి ఇంగ్లాండ్ ఆలౌరౌండర్ బెన్ స్టోక్స్ తన  మద్దతు మాత్రం కేన్ విలియమ్సన్ కే అంటూ సంచలన ప్రకటన చేశాడు. తనకంటే విలియమ్సనే ఈ అవార్డు అందుకోడానికి అన్నిరకాలుగా అర్హుడని స్టోక్స్ పేర్కొన్నాడు.    

ప్రపంచ కప్ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలై న్యూజిలాండ్ టీం ట్రోఫీని మిస్సయ్యింది. ఇలా కివీస్ ప్రపంచ కప్ కలను చిదిమేసింది ఆ దేశ పౌరుడే కావడం విశేషం. న్యూజిలాండ్ పుట్టి పెరిగిన బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ లో స్థిరపడ్డాడు. అక్కడే క్రికెటర్ గా అంచెలంచెలుగా ఎదిగి ఇంగ్లీష్ క్రికెట్ జట్టులో ఆలౌరౌండర్ గా స్థిరపడిపోయాడు. అయితే ఈ  ప్రపంచ కప్ ఫైనల్లో  స్టోక్స్(84 పరుగులు) అద్భుతంగా రాణించి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంగ్లాండ్ ను గెలిపించి...పుట్టి పెరిగిన న్యూజిలాండ్ ను ఓడించాడు. 

ఇలా వరుసగా రెండో సారి ప్రపంచ కప్ ఫైనల్ కు చేరుకున్న కివీస్ తమ జాతీయుడి చేతుల్లోనే ఓటమిని  చవిచూసింది. అయితే తమ ఓటమికి ముఖ్య కారణమైన స్టోక్స్ ను న్యూజిలాండ్ ఓ శతృవుగా భావించకుండా విదేశీ గడ్డపై తమ దేశ ఔన్నత్యాన్ని చాటిన  అరుదైన ఆటగాడిగా గుర్తించింది. అందుకోసమే ప్రతి సంవత్సరం దేశ కీర్తికి చాటిచెప్పిన అరుదైన వ్యక్తులకు అందించే  అత్యున్నత పురస్కారం ‘న్యూజిలాండర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుకు స్టోక్స్ ను ఎంపికచేశారు. 

అయితే ఇదే అవార్డుకు న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ కూడా నామినేట్ అయ్యాడు. దీంతో తాజాగా స్టోక్స్ కూడా తన మద్దతు విలియమ్సన్ కే అంటూ సంచలన ప్రకటన చేశాడు. అంతే కాదు తన అభిమానులు కూడా విలియయమ్సన్ కే మద్దలివ్వాలని స్టోక్స్ కోరాడు. 

''న్యూజిలాండ్ క్రికెట్ జట్టును ప్రపంచ కప్ వంటి మెగాటోర్నీలో విలియమ్సన్ విజయవంతంగా ముందుడి నడిపించాడు. ఇలా కెప్టెన్ గానే కాకుండా  వ్యక్తిగతంగా అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో జట్టును ఫైనల్ వరకు చేర్చాడు. దురదృష్టవశాత్తు ఆ జట్టు ట్రోఫీకి అందుకోలేకపోయింది. అందువల్ల  ప్రతిష్టాత్మక న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందేకోడానికి తనకంటే అతడికే ఎక్కువగా అర్హత వుంది'' అని స్టోక్స్ పేర్కోన్నాడు. 

స్టోక్స్ ను ఎందుకు నామినేట్ చేశారంటే

ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ సొంత దేశం న్యూజిలాండ్. అయితే స్టోక్స్ చిన్నపుడే తండ్రి గెరార్డ్ ఇంగ్లాండ్ కు వలవెల్లాడు. రగ్బీ క్రీడాకారుడైన అతడు తన కొడుకుని మాత్రం క్రికెటర్ చేశాడు. ఇలా తన అత్యుత్తమ ఆటతీరుతో స్టోక్స్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే అతడి తల్లిదండ్రులు మాత్రం తిరిగి  న్యూజిలాండ్ కు వెళ్లిపోయి అక్కడే నివసిస్తున్నారు. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ben Stokes (@stokesy) on Jul 23, 2019 at 1:27am PDT

click me!