పాకిస్థాన్‌తో మ్యాచ్ కు రోహిత్ శ‌ర్మ దూరం కానున్నాడా? టెన్షన్ పెంచిన బుమ్రా భార్య పోస్ట్

By Mahesh Rajamoni  |  First Published Jun 8, 2024, 10:03 AM IST

IND vs PAK : టీ20 ప్రపంచ కప్ 2024 లో భాగంగా జూన్ 9న న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భార‌త్-పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. అయితే, పాకిస్థాన్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం అనుమానంగానే క‌నిపిస్తోంది.
 


T20 World Cup 2024, IND vs PAK : క్రికెట్ ల‌వ‌ర్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ కు స‌ర్వం సిద్దమైంది. టీ20 ప్రపంచ కప్ 2024 లో భాగంగా జూన్ 9న న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భార‌త్-పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. అయితే, పాకిస్థాన్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం అనుమానంగానే క‌నిపిస్తోంది. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ భార‌త జ‌ట్టు స్టార్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా భార్య సంజ‌నా గ‌ణేశ‌న్ సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్ వైర‌ల్ గా మారి.. భార‌త అభిమానుల్లో టెన్ష‌న్ పెంచింది.

పాకిస్థాన్‌తో  మ్యాచ్ నుంచి రోహిత్ శర్మ ఔట్..?

Latest Videos

undefined

టీం ఇండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేశన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మిస్టరీ పోస్ట్‌ను షేర్ చేసింది. సంజనా గణేశన్ తన పోస్ట్‌లో 'జస్ప్రీత్ టాస్ కోసం వేచి ఉండలేను' అని రాశారు. ఇక సంజనా గణేశన్ పెట్టిన ఈ పోస్ట్ ఒక్కసారిగా పెను తుఫాను సృష్టించింది. సంజనా గణేశన్ చేసిన ఈ పోస్ట్ పాకిస్తాన్‌తో జరిగే T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా టాస్‌కు వస్తాడని చెబుతున్న‌ట్టుగా ఉంది. అంటే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా పాకిస్థాన్‌తో జరిగే టీ20 ప్రపంచకప్ మ్యాచ్ ఆడలేకపోవచ్చు. దీంతో జ‌స్ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా రావ‌చ్చు అనే చ‌ర్చ సాగుతోంది.

విభిన్న కామెంట్స్ తో అభిమానులు.. 

ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు అభిమానులు సంజనా గణేశన్ చేసిన‌ ఈ పోస్ట్‌ను యాడ్ ప్రమోషన్ గా పేర్కొంటున్నారు. మ‌రికొంత మంది గాయం కారణంగా రోహిత్ శర్మ పాకిస్తాన్‌తో టి20 ప్రపంచకప్ మ్యాచ్ ఆడలేకపోతే, హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉంటాడని కామంట్స్ చేస్తున్నారు. ఇందుకు కార‌ణం హార్దిక్ పాండ్యా భారత జట్టుకు వైస్ కెప్టెన్ కావడమేన‌ని పేర్కొంటున్నారు. ఏదేమైన మ్యాచ్ తుది జ‌ట్టులో ఎవ‌రెవ‌రూ ఉంటార‌నేదానిపై బీసీసీఐ ప్ర‌క‌ట‌న వ‌స్తేనే ఒక క్లారిటీ వ‌స్తుంది. కాగా, టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య మొత్తం 7 మ్యాచ్‌లు జరిగాయి. 7 మ్యాచ్‌ల్లో భారత్ 6 గెలిచింది. ఒక మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచింది. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఏడో విజయాన్ని నమోదు చేయడమే రోహిత్ సేన లక్ష్యంగా పెట్టుకుంది.

 

ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండ్ షో.. చిత్తుగా ఓడిన న్యూజిలాండ్.. కేన్ మామ‌కు బిగ్ షాక్.. !

click me!