KL Rahul : హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2024 57వ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పేరు నిత్యం వార్తల్లో నిలుస్తోంది.
KL Rahul - Sanjiv Goenka : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 లో భాగంగా 57వ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్‌తో జరిగిన ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాజయం పాలైంది. మ్యాచ్ ముగిసిన వెంటనే కెప్టెన్ కేఎల్ రాహుల్ పై లక్నో యజమాని సంజీవ్ గోయెంకా ఆగ్రహంతో ఊగిపోతూ తిడుతూ విరుచుకుపడ్డాడు. రాహుల్ తో పాటు లక్నో కోచ్ తో కూడా గోయెంకా వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
అయితే, గోయెంకా ఈ స్థాయిలో గ్రౌండ్ లో కేఎల్ రాహుల్ ను అవమానించేలా ఎందుకు వ్యవహించడం వెనుక మ్యాచ్ ఓటమితో పాటు ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే కొత్త చర్చ మొదలైంది. అయితే, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక నివేదిక ప్రకారం, లక్నో సూపర్ జెయింట్స్ యజమాని తన జట్టు బ్యాటింగ్ చేసిన విధానం పట్ల అసంతృప్తిగా ఉన్నాడు.. అలాగే, భారీ స్కోర్ చేసిన వేదికలో తమ టీమ్ బ్యాటింగ్ చేసిన తీరుపై కేఎల్ రాహుల్ ను ప్రశ్నించాడు. బలమైన జట్టుతో మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఎల్ఎస్జీ క్యాంపులో మార్పులు చేయకుండా కోచ్, కెప్టెన్ పెద్దగా పట్టించుకోకపోవడంతో జట్టు విషయాలు సాధారణ స్థితికి చేరుకున్నాయని వాదనలు చేసిన పలు రిపోర్టులు పేర్కొన్నాయి.
undefined
లక్నో కెప్టెన్సీ నుంచి కేఎల్ రాహుల్ ఔట్.. ఐపీఎల్ కు గుడ్‌బై చెప్పినట్టేనా? ఈ వార్తల్లో నిజమెంత?
అలాగే, లక్నో యజమాని సంజీవ్ గోయెంక-కేఎల్ రాహుల్ కు మధ్య సంబంధాలు క్షీణించాయనీ, ఇద్దరికి పడటం లేదనే వార్తలను ఎల్ఎస్జీ వర్గాలు ఖండిచాయి. ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేవనీ, అంతా బాగానే ఉందనీ, కెప్టెన్ గా కేఎల్ రాహుల్ మాత్రమే కొనసాగుతారని లక్నో వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం తర్వాతి మ్యాచ్ లపై దృష్టి సారించినట్టు తెలిపాయి. కాగా, హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో ఓటమి తర్వాత కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. మాటలు రావడం లేదు.. ఇలాంటి బ్యాటింగ్ ఇన్నింగ్స్ లను అప్పుడప్పుడు టీవీలలో చూస్తుంటాం.. ఇప్పుడు నిజంగానే గ్రౌండ్ లో చూశామని చెప్పాడు. హైదరాబాద్ ప్లేయర్లు మంచి ప్రదర్శన చేశారని తెలిపారు. కాగా, ప్లేఆఫ్ అవకాశాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. రాబోయే మ్యాచ్ లను తప్పక గెలవాల్సి ఉంటుంది. దీంతో పాటు నెట్ రన్ రేటు కూడా కీలకంగా మారనుంది.
కీలక మ్యాచ్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కు బిగ్ షాక్.. రిషబ్ పంత్ పై నిషేధం !