KL Rahul : లక్నో యజమాని సంజీవ్ గోయెంకా స్టేడియంలోనే మొత్తం ప్రేక్షకుల ముందు కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను అవమానించడం, గోయెంకా విరుచుకుపడుతుండగా రాహుల్ వింటూనే ఉన్నారు. అందరి ముందూ జరిగినట్టు దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి.
IPL - KL Rahul : ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాజయం తర్వాత కెఎల్ రాహుల్‌పై ఎల్‌ఎస్‌జీ యజమాని సంజీవ్ గోయెంకా విరుచుకుపడ్డాడు. గ్రౌండ్ లోనే రాహుల్ పై ఫైర్ అవుతూ తిడుతున్న వీడియో దృశ్యాలు వైరల్ కావడంతో హాట్ టాపిక్ గా మారాయి. మ్యాచ్ పూర్తయిన వెంటనే గ్రౌండ్ లోనే అన్ని కెమెరాలు ఫోకస్ చేసిన సమయంలో ఈ స్థాయిలో ఇద్దరి మధ్య హాట్ హాట్ చర్చలు సాగడం క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేశాయి. ప్రస్తుతం కేఎల్ రాహుల్,సంజీవ్ గోయెంకలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారారు.
లక్నో యజమాని సంజీవ్ గోయెంకా స్టేడియం లోపల మొత్తం ప్రేక్షకుల ముందు కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను అవమానించడం, గోయెంకా విరుచుకుపడుతుండగా రాహుల్ వింటూనే ఉన్నారు. అందరి ముందూ జరిగినట్టు దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ రాబోయే మ్యాచ్ లకు లక్నో తరపున ఆడడనీ, వచ్చే సీజన్‌లో జట్టులో ఉంచుకునే అవకాశం లేదని పలు నివేదికలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదే కాకుండా ఐపీఎల్ కు కేఎల్ రాహుల్ గుడ్ బై చెప్పబోతున్నాడని కూడా చర్చ సాగుతోంది. అయితే, ఈ వార్తల్లో నిజమెంత? నిజంగానే రాహుల్ లక్నోను వీడుతున్నాడా? ఐపీఎల్ కు వీడ్కోలు పలుకనున్నాడా?
కీలక మ్యాచ్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కు బిగ్ షాక్.. రిషబ్ పంత్ పై నిషేధం !
2022లో వేలానికి ముందు రూ. 17 కోట్లకు చేరిన రాహుల్‌ను 2025లో మెగా వేలానికి ముందు జట్టులో ఉంచుకునే అవకాశం లేదని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. అయితే, కెప్టెన్ తనంతట తానుగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవచ్చునని ఊహాగానాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తదుపరి రెండు గేమ్‌లలో కేవలం బ్యాటింగ్‌పై దృష్టి పెట్టనున్నట్టు పేర్కొంటున్నాయి. "ఢిల్లీ క్యాపిటల్స్ తో తదుపరి గేమ్‌కు ముందు ఐదు రోజుల గ్యాప్ ఉంది. ప్రస్తుతానికి, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, కానీ రాహుల్ మిగిలిన రెండు గేమ్‌ల కోసం తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని ప్లాన్ చేస్తే, మేనేజ్‌మెంట్ పెద్దగా పట్టించుకోదని అర్థమైంది" అని ఐపీఎల్ వర్గాలు తెలిపినట్టు పీటీఐ కథనాలు పేర్కొన్నాయి.
ఇదే సమయంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంకా, కేఎల్ రాహుల్ మధ్య అంతా బాగానే ఉందని మరో వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ నివేదించింది. కేఎల్ రాహుల్ వస్తున్న పుకార్లను, లక్నో యజమాని మధ్య వివాదం గురించి వస్తున్న వార్తలను ఎల్ఎస్జీ సన్నిహిత వర్గాలు ఖండించాయి. "ఇద్దరి మధ్య అంతా బాగానే ఉంది.. ఈ సీజన్‌లో రాహుల్ మాత్రమే జట్టుకు నాయకత్వం వహిస్తారు" అని చెప్పారు. అలాగే, “రాహుల్‌ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తారనీ, వేలంలో తీసుకోరని అంతా పుకార్లు. ఆడిన చివరి మ్యాచ్ మేము అనున్నవిధంగా జరగలేదు కానీ ఇప్పుడు జట్టు, యజమానుల మధ్య అంతా బాగానే ఉంది. రాహుల్ మంచి స్పేస్‌లో ఉన్నాడు. డీసీతో జరిగే మ్యాచ్‌కి ముందు విశ్రాంతి తీసుకుంటున్నాడు" అని లక్నో టీమ్ సన్నిహిత వర్గాలు తెలిపినట్టు ఐఎఎన్ఎస్ నివేదించింది. కాబట్టి కెప్టెన్ గా కేఎల్ రాహుల్ కొనసాగుతారు. ఇక కేఎల్ రాహుల్ ఐపీఎల్ కు వీడ్కోలు పలుకుతున్నారనేది కూడా కేవలం పుకార్లు మాత్రమే.. ఇందులో నిజం లేదు.
ధోని క్రేజ్ అట్లుంటది మరి.. భద్రతను ఉల్లంఘించి గ్రౌండ్ లోకి దూసుకొచ్చిన అభిమాని