'WeApp' తో టీడీపీ అనైతిక చ‌ర్య‌లు.. మహిళల భ‌ద్ర‌త‌కు ముప్పు : వైఎస్ఆర్సీపీ

By Mahesh Rajamoni  |  First Published May 11, 2024, 5:57 PM IST

TDP vs YSRCP : తెలుగుదేశం పార్టీ అనైతిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌నీ, ‘WeApp’ పేరిట మహిళల వివరాలు సేక‌రిస్తోంద‌ని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. ఇప్ప‌టికే వయస్సు సహా ఇతర వివరాలు టీడీపీ చేతిలోకి వెళ్లాయ‌నీ, మహిళల భద్రతకు పెనుముప్పు పొంచివుంద‌ని ఆరోపించింది.
 


TDP vs YSRCP : టీడీపీపై వైఎస్ఆర్సీపీపై తీవ్ర ఆరోపణలు చేసింది. కోడలికి చెప్పి అత్త తెడ్డు నాకడం త‌ర‌హాలో ఊరందరికీ నీతులు చెప్పే తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఇప్పుడు అనైతిక చర్యలకు పాల్పడుతోందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. గ్రామాల్లో.. పట్టణాల్లో వాలంటీర్లు మహిళలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారనీ, ఈ వివ‌రాలు కిడ్నాపర్ల చేరుతోందనీ, దీంతో వాళ్లొచ్చి ఒంటరి మహిళలు, ఏ ఆదరవులేని యువతులను కిడ్నప్ చేస్తున్నారని గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు వేదికలమీద కేకలు పెట్టారు కానీ, తీరా ఇప్పుడు ఎన్నికల సమయంలో తెలుగుదేశం రాష్ట్రంలోని మొత్తం మహిళలు, వారి వయసు, ఊడు, అడ్రస్, ఆధార్ వంటి వివరాలు సేకరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది.

దీని కోసం టీడీపీ ప‌లు ర‌కాల యాప్ ల‌ను ఉప‌యోగించిన విష‌యాల‌ను వైఎస్ఆర్సీపీ ప్ర‌స్తావించింది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సాధికార సర్వే పేరుతో ప్రజల సమాచారాన్ని సేకరించి, అప్పట్లోనే డేటా చౌర్యానికి పాల్పడి టీడీపీ సేవా మిత్ర యాప్‌లో పొందుపరిచిన విషయాలు గుర్తుచేశారు. ఇప్పుడు అదే త‌ర‌హాలో మరింత ఆధునీకరించి ఇప్పుడు ‘వుయ్‌’ యాప్ తీసుకువ‌చ్చార‌నీ, ఇందులో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఓటర్ల పేర్లు, చిరునామాలు, ఆధార్, ఫోన్‌ నంబర్లు, ఓటరు ఐడీ నంబర్లు, వృత్తి తదితర వ్యక్తిగత వివరాలన్నీ పొందుపరిచార‌ని వైకాపా ఆరోపించింది. వారు ఏ పార్టీ సానుభూతిపరులో కూడా ఇందులో ఉంద‌నీ, ఇది ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కుకు పూర్తి విరుద్ధమ‌ని వైకాపా విమ‌ర్శించింది.

Latest Videos

undefined

ప‌డిపోతున్న కూట‌మి గ్రాఫ్‌.. జగనన్న వన్స్ మోర్ అంటున్న జనాలు.. వైకాపా

ప్రతి మహిళా వివరాలూ తమదగ్గర దాచిపెట్టుకుని వారి వ్యక్తిగత స్వేచ్ఛను సైతం  హరించేందుకు కుట్ర పన్నుతున్నారనీ, ఇది పూర్తిగా అనైతికమ‌ని తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్సీపీ విమ‌ర్శ‌లు గుప్పించింది. అధికారంలో ఉండగా ప్రజా సాధికార సర్వే పేరుతో డేటా చౌర్యం చేసిన టీడీపీ,  ఇప్పుడు ‘వుయ్‌’ యాప్‌లో ఓటర్ల సమగ్ర సమాచారం.. ఓటర్ల స్లిప్పులతో ప్రత్యేక బార్‌కోడ్‌ ఉన్న కరపత్రాల పంపిణీ చేస్తోంద‌ని వైకాపా ఆరోపించింది.  బార్‌కోడ్‌ స్కాన్‌ చేయగానే హైదరాబాద్‌ నుంచి డిజిటల్‌ చెల్లింపులు.. ఓటరుకు రూ.5 వేలు చెల్లిస్తున్నారని ఆరోపించింది.  బూత్‌ కమిటీల ద్వారా ఇంటింటా స్లిప్పుల పంపిణీ.. దీని పర్యవేక్షణ, బార్‌కోడ్‌ స్కాన్‌కు మరో బృందం ఉంద‌నీ, మొత్తం పర్యవేక్షణకు హైదరాబాద్‌లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌.. నియోజకవర్గానికి రూ.87.50 కోట్ల చొప్పున డిజిటల్‌ చెల్లింపులు జ‌రుగుతున్నాయ‌ని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. ఇలా సేక‌రించిన వివ‌రాలు దుర్వినియోగమైతే వారి భద్రతకు పెను ముప్పు అని ప్రజల్లో ఆందోళన నెలకొందని వైఎస్ఆర్సీపీ పేర్కొంది.

కీల‌క మ్యాచ్ కు ముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు బిగ్ షాక్.. రిషబ్ పంత్ పై నిషేధం !

click me!