India vs England: భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో చివరిదైన 5వ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు ధర్మశాల చేరుకుంది. ఈ మ్యాచ్ లో ఆడటం ద్వారా రవిచంద్రన్ అశ్విన్ భారత్ తరఫున 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన 14వ భారతీయుడిగా నిలుస్తాడు.
IND v ENG - Rohit Sharma : ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య 5వ టెస్టు మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇక్కడ జరిగే మ్యాచ్ లో ఇరు జట్లు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దీంతో భారత్-ఇంగ్లాండ్ 5వ టెస్టు మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్‌లోనూ భారత జట్టు మంచి ప్రదర్శన కనబర్చాలని చూస్తోంది. ఇంగ్లాండ్ సైతం ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. ఇప్పటికే తిరుగులేని 3-1 ఆధిక్యాన్ని సాధించి సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 స్టాండింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచేందుకు మరో విజయంతో సిరీస్‌ను ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 8 మ్యాచ్‌లలో భారత్ 5 విజయాలతో, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా కంటే ముందుంది. ఇక ఇంగ్లాండ్ ఎనిమిదో స్థానంలో ఉంది.
ధర్మశాలలో భారత్ రికార్డులు..
2017లో ఆస్ట్రేలియాతో ఈ వేదికపై భారత్ ఒక టెస్టులో మాత్రమే ఆడింది. టెస్టుతో పాటు భారత్ మూడు టీ20లు ఆడగా, అందులో రెండు గేమ్ లలో విజయం సాధించింది. ఇక్కడ 5 వన్డే మ్యాచ్ లను ఆడగా, 3 విజయాలు సాధిచింది. వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్‌తో ఈ వేదికపై భారత్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడగా, 4 వికెట్ల తేడాతో గెలిచింది.
టెస్ట్ క్రికెట్‌లో పరుగుల కంటే ఎక్కువ వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు
ఇక టెస్టు మ్యాచ్ విషయానికి వస్తే ఇక్కడ ఒక్క టెస్టు మ్యాచ్ ఆడింది. 2017లో భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన 3 మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లలో చెరో ఒక టెస్టును గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. కీలకమైన మూడో మ్యాచ్ ధర్మశాలలో జరిగింది. అప్పటికే కెప్టెన్ గాయంతో జట్టుకు దూరం కావడంతో అజింక్యా రహానే కెప్టెన్సీలో ఆడిన భారత్.. 8 వికెట్ల తేడాతో విజయం సాధించి 2-1తో సిరీస్ ను కైవంస చేసుకుంది. ఇప్పటివరకు ఇక్కడ ఆడిన అన్ని ఫార్మాట్ మ్యాచ్ లను గమనిస్తే భారత్ గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయి.
ధర్మశాల టెస్టుకు భారత్ vs ఇంగ్లాండ్ స్క్వాడ్స్:
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్ , ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా , అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.
ఇంగ్లాండ్ : బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, రెహాన్ అహ్మద్, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, షోయిబ్ బషీర్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), డాన్ లారెన్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఓలీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్.
6 బంతుల్లో ఆరు సిక్సర్లు.. మరో భారత ప్లేయర్ సంచలన బ్యాటింగ్ !