India vs England: ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు ధర్మశాలలో అడుగుపెట్టింది. రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ ల నేతృత్వంలోని టీమిండియా సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
IND v ENG - Rohit Sharma : భారత్-ఇంగ్లాండ్ మధ్య 5వ టెస్టు మ్యాచ్ ధర్మశాలలో గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టీమిండియా అక్కడకు చేరుకుంది. అయితే, భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ హెలికాప్టర్‌లో హిమాచల్ ప్రదేశ్‌లోని ఈ ప్రసిద్ధ గ్రౌండ్ కు చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కు రోహిత్ హాజరయ్యారు. అక్కడి నుంచి సోమవారం ధర్మశాలకు బయలుదేరారు. మంగళవారం రోహిత్ హెలికాప్టర్‌లో ధర్మశాల చేరుకున్నారు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ హెలిప్యాడ్ నుండి బయలుదేరి తన కారులో టీమిండియా బస చేసిన హోటల్ వైపు వెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోహిత్‌కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. ధర్మశాలలో జరిగే భారత్-ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్‌లోనూ భారత జట్టు మంచి ప్రదర్శన కనబర్చాలని చూస్తోంది. ఇంగ్లాండ్ సైతం ఎలాగైనా గెలవాలని భావిస్తోంది.
6 బంతుల్లో ఆరు సిక్సర్లు.. మరో భారత ప్లేయర్ సంచలన బ్యాటింగ్ !
ఇంగాండ్‌తో సిరీస్‌లో ఐదో టెస్టు మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు ఆదివారం ధర్మశాల చేరుకుంది. కానీ కెప్టెన్ మొత్తం జట్టుతో ధర్మశాల చేరుకోలేకపోయాడు. జామ్‌నగర్‌కు ఆహ్వానం అందడంలో ఆయన ఆలస్యమయ్యారు. అయితే ఎట్టకేలకు రోహిత్ ధర్మశాల చేరుకున్నాడు . ఐపీఎల్‌కు ముందు తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్ ముగిశాఖ మళ్లీ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ తరఫున బరిలోకి దిగనున్నాడు.
भारतीय टीम के कप्तान रोहित शर्मा पहुंचे धर्मशाला pic.twitter.com/IoIYdP1S2i
— Himachal Abhi Abhi (@himachal_abhi)ఐదో టెస్టులోనూ గెలవాలనీ..
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌పై ఆసీస్ గెలిచిన తర్వాత అగ్రస్థానంలో భారత జట్టు కొనసాగుతోంది. ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో రోహిత్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 62 పాయింట్లు సాధించింది. భారత జట్టు పాయింట్ల శాతం 64.58. ధర్మశాలలో జరిగే మ్యాచ్‌లో గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడమే రోహిత్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇప్పటికే ఇంగ్లండ్‌తో సిరీస్‌ను భారత జట్టు కైవసం చేసుకున్నప్పటికీ.. ధర్మశాల టెస్టు మ్యాచ్‌కు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి కొంత పరువు దక్కించుకోవాలని ఇంగ్లాండ్ తహతహలాడుతున్నట్లే, భారత జట్టు కూడా సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకోవాలని వ్యూహాలు సిద్దం చేస్తోంది. దీంతో ధర్మశాల టెస్టు మ్యాచ్ చాలా ఆసక్తికరంగా మారనుంది.
IPL 2024 టైటిల్ కోసం సన్‌రైజర్స్ మాస్టర్ ప్లాన్.. ఆరెంజ్ ఆర్మీకి ఛాంపియన్ లీడర్..!