IPL 2024: రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ గుజ‌రాత్ టైటాన్స్ యంగ్ ప్లేయ‌ర్..

By Mahesh RajamoniFirst Published Mar 5, 2024, 11:08 PM IST
Highlights

IPL 2024 - Gujarat Titans: ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ రాబిన్ మింజ్ ను రూ .3.6 కోట్లకు ద‌క్కించుకుంది. జార్ఖండ్ లోని గుమ్లా జిల్లాలోని షిమల్ గ్రామానికి చెందిన రాబిన్ ఇటీవల తన అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 
 

Gujarat Titans -  Robin Minz : ఐపీఎల్ 2024కు ముందు గుజ‌రాత్ టైటాన్స్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఆ టీమ్ కు చెందిన ఒక యంగ్ ప్లేయ‌ర్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డాడు. దీంతో రాబోయే సీజ‌న్ కు అత‌ను సేవ‌ల‌ను కోల్పోనుంద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. సంబంధిత వివ‌రాల ప్ర‌కారం.. గుజరాత్ టైటాన్స్ ఆటగాడు రాబిన్ మిన్స్ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. రాబిన్ మిన్స్ బైక్ ప్రమాద వార్తను అత‌ని కుటుంబ స‌భ్యులు ధృవీకరించారు.  రాబిన్ కు గాయాలు పెద్దగా లేవనీ, ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉన్నాడని తెలిపారు.

రాబిన్‌ మిన్స్‌ ప్రయాణిస్తున్న బైక్‌ మరో వాహ‌నాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కవాసకి సూపర్‌బైక్‌ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. రాబిన్ కుడి మోకాలికి గాయమైంది. రాబోయే ఐపీఎల్ సీజన్‌లో రాబిన్ అరంగేట్రం చేయనున్న తరుణంలో ఈ గాయం అత‌ని కెరీర్ కు తీవ్ర న‌ష్టం క‌లిగించే అవ‌కాశ‌ముంది. గిరిజన తెగ నుంచి ఐపీఎల్‌కు చేరిన తొలి ఆటగాడు రాబిన్ మిన్స్‌ను రూ.3.60 కోట్లకు గుజరాత్ కొనుగోలు చేసింది. ధోనీకి వీరాభిమాని అయిన రాబిన్ తోటి నటీమణులతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ధోనీ కోచ్ చంచల్ భట్టాచార్య కూడా రాబిన్‌కు శిక్షణ ఇచ్చాడు.

టెస్ట్ క్రికెట్‌లో పరుగుల కంటే ఎక్కువ వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు

రాంచీకి చెందిన రాబిన్ మిన్స్ జార్ఖండ్ తరఫున ఇంకా ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడలేదు. కానీ అతను జార్ఖండ్ అండ‌ర్-19, అండ‌ర్-25 జట్లలో చేర్చబడ్డాడు. రాబ్ తండ్రి మాజీ సైనికుడు. ఆయ‌న ప్రస్తుతం బిర్సా ముండా విమానాశ్రయంలో సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. రాంచీ టెస్టు ముగించుకుని తిరిగి వస్తుండగా విమానాశ్రయంలో రాబిన్ తండ్రిని శుభ్‌మన్ గిల్ కలిశాడు. దానికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఐపీఎల్ 2024 ఎప్పుడు మొదలవుతుందంటే?

2024 సీజన్ తొలి మ్యాచ్ మార్చి 22న ఎంఏ చిదంబరం స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ప్రారంభం కానుంది. లోక్ సభ ఎన్నికల ప్రక్రియను నిశితంగా గమనిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మొదటి 21 మ్యాచ్ లకు షెడ్యూల్ విడుద‌ల చేసింది. త్వ‌ర‌లోనే మ‌రో స‌గం షెడ్యూల్ ను విడుద‌ల చేయ‌నుంది.

WPL 2024: ఆర్సీబీతో పెట్టుకుంటే అట్లుంట‌ది.. బిగ్ సిక్సర్ తో కారు అద్దం ప‌గుల‌కొట్టిన ఎలీస్ పెర్రీ

click me!