IPL 2024 Auction LIVE: దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో కొత్త రికార్డులు నమోదయ్యాయి. మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.
IPL 2024 Auction LIVE updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ను క్యాష్ రిచ్ లీగ్ అంటారు. ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్ల కంటే బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ ద్వారానే ఎక్కువ ఆదాయం సమకూరుతుంది. దీంతో ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడాలనుకుంటున్నారు. ఇదే సమయంలో క్రికెట్ ప్రపంచంలోని అన్ని దేశాల ప్లేయర్స్, సీనియర్లు, జూనియర్లు ఉండటంతో ఐపీఎల్ ఆడే ప్లేయర్స్ కెరీర్ కు ఉపయోగపడటం కూడా ఒకటి. అయితే, ఐపీఎల్ ప్రారంభం నుంచి గమనిస్తే... ఇప్పటితో ప్లేయర్ల కోసం జట్లు ఖర్చు చేయడం భారీగా పెరుగుతోంది. దీంతో ఐపీఎల్ లో ఖరీదైన ప్లేయర్లు పెరుగుతున్నాయి.
2008 నుంచి 2023 వరకు జరిగిన ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఇంగ్లాండ్ ఆటగాడు సామ్ కరన్ రికార్డు సృష్టించాడు. గతేడాది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు సామ్ కరన్ ను పంజాబ్ కింగ్స్ రూ.18.50 కోట్లకు కొనుగోలు చేసింది. అదేవిధంగా ఐపీఎల్ 2023 వేలం అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ 2024 మినీ వేలం మరిన్ని కార్డులు సృష్టించింది. దుబాయ్ లోని కోకాకోలా ఎరీనాలో జరుగుతున్న ఐపీఎల్ 2024 మినీ వేలంలో పలు రికార్డులు బద్దలయ్యాయి. మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్ సహా పలువురు విదేశీ ఆటగాళ్లు ఫ్రాంచైజీల నుంచి భారీ బిడ్లు తీసుకున్నారు.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్-10 ప్లేయర్స్ వీరే..
క్రమ సం. | ప్లేయర్ | టీమ్ | ధర కోట్లలో | ఇయర్ |
1 | మిచెల్ స్టార్క్ | కోల్ కతా నైట్ రైడర్స్ | 24.75 | 2024 |
2 | పాట్ కమ్మిన్స్ | సన్ రైజర్స్ హైదరాబాద్ | 20.5 | 2024 |
3 | సామ్ కరన్ | పంజాబ్ కింగ్స్ | 18.5 | 2023 |
4 | కామెరూన్ గ్రీన్ | ముంబయి ఇండియన్స్ | 17.5 | 2023 |
5 | బెన్ స్టోక్ | చెన్నై సూపర్ కింగ్స్ | 16.25 | 2023 |
6 | క్రిస్ మోరిస్ | రాజస్థాన్ రాయల్స్ | 16.25 | 2021 |
7 | నికోలస్ పూరాన్ | లక్నో సూపర్ జెయింట్స్ | 16 | 2023 |
8 | యువరాజ్ సింగ్ | ఢిల్లీ డేర్ డెవిల్స్ | 16 | 2015 |
9 | పాట్ కమ్మిన్స్ | కోల్ కతా నైట్ రైడర్స్ | 15.5 | 2020 |
10 | ఇషాన్ కిషన్ | ముంబయి ఇండియన్స్ | 15.25 | 2022 |
IPL 2024 Auction: మిచెల్ స్టార్క్ దెబ్బ.. ఐపీఎల్ అబ్బ.. అత్యంత ఖరీదైన ప్లేయర్ ఇతనే..
IPL 2024 Auction: చెన్నై టీంలోకి డారిల్ మిచెల్.. కీవీస్ ప్లేయర్ కు భారీ ధర..
IPL 2024 Auction: ఐపీఎల్ రికార్డు బ్రేక్.. ప్యాట్ కమ్మిన్స్ కు దిమ్మదిరిగే ధర.. !