IPL 2024 Auction: 20 లక్ష‌ల‌ ఎంట్రీతో రూ.7 కోట్లు కొల్ల‌గొట్టిన యంగ్ ప్లేయ‌ర్ కుమార్‌ కుశాగ్ర

By Mahesh Rajamoni  |  First Published Dec 19, 2023, 8:03 PM IST

IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలంలో జార్ఖండ్ వికెట్ కీపర్ కుమార్ కుశాగ్ర‌ను వేలంపాట ఆసక్తిని రేకెత్తించగా,  చివ‌ర‌కు ఢిల్లీ క్యాపిటల్స్  రూ.7.2 కోట్లతో ద‌క్కించుకుంది. 
 


IPL 2024 Auction LIVE:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 వేలంలో చాలా మంది ఆటగాళ్లకు ఊహించిన దానికంటే ఎక్కువ ధర లభించింది. ఈ వేలంలో విదేశీ ఆటగాళ్లతో పాటు స్వదేశీ ఆటగాళ్లు కూడా భారీగానే డబ్బును అందుకున్నారు. అయితే, 20 ల‌క్ష‌ల బేస్ వేలంతో ఎంట్రీ ఇచ్చిన ఒక యంగ్ ప్లేయ‌ర్ ఏకంగా రూ.7 కోట్లు కొల్ల‌గొట్టాడు. 19 ఏళ్ల ఈ అనామ‌క ఆటగాడి కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ.7.20 కోట్లు ఖర్చు చేసింది.  అత‌నే కుమార్ కుశాగ్ర. అత‌న్ని బేస్ ప్రైస్ కంటే చాలా రెట్లు ఎక్కువ ధరకు ఢిల్లీ కొనుగోలు చేసింది. అండర్-19 జట్టు భారత జట్టులో కుమార్ కుశాగ్ర  అద్భుత‌ ప్రదర్శన చేశాడు. దేశవాళీ మ్యాచుల్లో జార్ఖండ్ తరఫున ఆడుతున్నాడు.

కుమార్ కుషాగ్రా బేస్ ప్రైస్ రూ.20 లక్షలు. తొలి బిడ్ ను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగింది. చెన్నై రూ.60 లక్షలకు తుది బిడ్ దాఖలు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ వేలంపాట ప్రారంభించింది. ఢిల్లీ, గుజరాత్ జట్ల మధ్య జరిగిన వేలంపాట‌లో గుజరాత్ రూ.7 కోట్ల వరకు బిడ్ వేసింది. కానీ చివరికి ఢిల్లీ అత‌న్ని రూ.7.20 కోట్లకు కొనుగోలు చేసింది.

Latest Videos

కుశాగ్ర స్వస్థ‌లం జార్ఖండ్‌. ఫస్ట్ క్లాస్ లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు. 2022 ఫిబ్రవరిలో జార్ఖండ్ తరఫున తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. అదే సమయంలో లిస్ట్ ఎలో మొదటి మ్యాచ్ 2021 ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్ తో జరిగింది. 2021 నవంబర్ లో తొలి టీ0 మ్యాచ్ ఆడాడు. భారత అండర్-19 జట్టు తరఫున కుశాగ్ర‌ పలు సందర్భాల్లో మంచి ప్రదర్శన చేశాడు. 23 లిస్ట్ ఏ మ్యాచుల్లో 700 పరుగులు చేశాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు వుండ‌టం విశేషం. 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల‌లో 868 పరుగులు చేశాడు. అదే సమయంలో 11 టీ20 మ్యాచ్ ల‌లో 140 పరుగులు చేశాడు.

 

Talented keeper who hits the ball hard. It's a DC thing 🤙🏼 pic.twitter.com/jZBRNjurEI

— Delhi Capitals (@DelhiCapitals)

 

IPL 2024 Auction: ఐపీఎల్ వేలంలో రికార్డు ధ‌ర‌పై ప్యాట్ కమిన్స్ రియాక్ష‌న్ ఇదే..

 IPL 2024 Auction: యంగ్ ప్లేయ‌ర్ ను 8.4 కోట్ల‌కు దక్కించున్న చెన్నై.. ఎవ‌రీ స‌మీర్ ర‌జ్వీ ?

click me!