IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ప్లేయర్స్ వేలంలో మరో రికార్డు ధరతో ఆస్ట్రేలియన్ ప్లేయర్ ప్యాట్ కమ్మిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ టీం దక్కించుకుంది.
IPL 2024 Auction LIVE: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలంలో సంచలనాలు నమోదవుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్ల రికార్డులు నమోదయ్యాయి. ఆస్ట్రేలియన్ ప్లేయర్ మిచెట్ స్టార్క్ ను ఏకంగా 24.75 కోట్లతో కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. అలాగే, ఈ వేలంలో రెండో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా ప్యాట్ కమిన్స్ నిలిచాడు. అతన్ని హైదరాబాద్ టీమ్ రూ.20.50 కోట్లతో కోనుగోలు చేసింది.
దుబాయ్ లో జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో ప్యాట్ కమిన్స్ తన అద్భుతమైన ధరతో క్రికెట్ ప్రపంచంపై తనదైన ముద్ర వేశాడు. గత నెలలోనే ఆస్ట్రేలియా ప్రపంచ కప్ 2023లో విజయవంతమైన ప్రయాణం చేసింది. వరల్డ్ కప్ అందించిన సారథిగా, మంచి ప్లేయర్ గా గుర్తింపు ఉండటంతో అతని కోసం సన్ రైజర్స్ భారీ ధరకు వెనుకాడలేదు. ఐపీఎల్ వేలం చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా ప్యాట్ కమ్మిన్స్ నిలిచాడు.
undefined
సన్ రైజర్స్ టీం తనను కొనుగోలు చేసిన తర్వాత ప్యాట్ కమ్మిన్స్ స్పందిస్తూ ఆనందం వ్యక్తంచేశాడు. టీం విజయవంతంగా ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. ''రాబోయే ఐపీఎల్ కోసం హైదరాబాద్ టీంలో చేరడం సంతోషంగా ఉంది. ఆరెంజ్ ఆర్మీ గురించి చాలా విన్నాను, హైదరాబాద్ లో కొన్ని సార్లు ఆడాను, బాగా నచ్చింది నాకు. ఇంకా వేచి వుండలేను.. మరో ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ ను కూడా జట్టులో చూడటం సంతోషంగా ఉంది. ఈ సీజన్ లో మేం చాలా సరదాగా ఉండబోతున్నాం, చాలా విజయాలు సాధిస్తామని ఆశిస్తున్నాం' అని పేర్కొన్నాడు.
𝑻𝒉𝒊𝒔 𝒍𝒊𝒕𝒕𝒍𝒆 PAT 𝒐𝒇 𝒍𝒊𝒇𝒆 𝒊𝒔 𝒄𝒂𝒍𝒍𝒆𝒅 𝑯𝒂𝒑𝒑𝒊𝒏𝒆𝒔𝒔 🧡
Welcome, Cummins! 🫡 pic.twitter.com/qSLh5nDbLM
IPL 2024 Auction: యంగ్ ప్లేయర్ ను 8.4 కోట్లకు దక్కించున్న చెన్నై.. ఎవరీ సమీర్ రజ్వీ ?