IPL 2024 Auction LIVE: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలంలో సంచలనాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక 20 ఏండ్ల యంగ్ ప్లేయర్ సమీర్ రజ్వీ రికార్డు ధరతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
IPL 2024 Auction LIVE updates: ఐపీఎల్ 2024 వేలంలో చెన్నై సూపర్ కింగ్ ఒక యంగ్ ప్లేయర్ ను ఏకంగా రూ.8.4 కోట్లకు కొనుగోలు చేసింది. అతనే యూపీ స్టార్ సమీర్ రిజ్వీ. ఢిల్లీ క్యాపిటల్స్ బిడ్ ప్రారంభించగా, అతని కోసం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ కూడా పోటీలోకి దిగాయి. బిడ్ పోటీ సరవత్తరంగా కొనసాగగా, చివరకు సమీర్ రజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.
ఎవరీ సమీర్ రజ్వీ.. ?
ఐపీఎల్ 2024 వేలంలో ఉత్తరప్రదేశ్ బ్యాట్స్ మన్ సమీర్ రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ రూ.8.4 కోట్లకు కొనుగోలు చేసింది. అతని బేస్ ప్రైస్ రూ.20 లక్షలు. అయిన్పటికీ మూడు ఫ్రాంఛైజీలు అతన్ని దక్కించుకోవడానికి గట్టిగా పోటీ పడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్ బిడ్ లో చేరడానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య వేలంపాట జోరుగా సాగింది. గుజరాత్ టైటాన్స్ 7.6 కోట్ల వద్ద బిడ్ ఆపివేయగా, ఢిల్లీ, చెన్నై టీమ్ లు బిడ్ లో ముందుకు సాగాయి. చివరకు సమీర్ ను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.
ఇటీవలి జరిగిన ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ లో తర్వాత సమీర్ రజ్వీ వెలుగులోకి వచ్చాడు. అక్కడ తన ఆటతో అదరగొట్టాడు. కాన్పూర్ సూపర్ స్టార్స్ తరఫున తొమ్మిది ఇన్నింగ్స్ లలో రెండు సెంచరీలతో సహా 455 పరుగులు చేశాడు. ఈ సీజన్ ఆరంభంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా తన భారీ హిట్టింగ్ సామర్థ్యాన్ని చాటుకున్నాడు. రిజ్వీ 18 సిక్సర్లు బాదాడు, అతను ఎదుర్కొన్న ప్రతి 11 బంతుల్లో ఒక సిక్సర్ కొట్టడం విశేషం.
ఇప్పటివరకు 11 టీ20 మ్యాచ్ లను ఆడిన సమీర్ రిజ్వీ 49.16 సగటుతో 295 పరుగులు చేశాడు. పురుషుల అండర్-23 స్టేట్ ఎ టోర్నమెంట్ లో కుడిచేతి వాటం బ్యాట్స్ మన్ కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ తో అలరించాడు. రెండు అర్ధశతకాలు, రెండు సెంచరీలు సాధించాడు. ఫైనల్‌లో 50 బంతుల్లో 84 పరుగులు చేసి ఉత్తరప్రదేశ్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. రిజ్వీ టోర్నీలో అత్యధిక సిక్సర్లు (37) కొట్టాడు.
IPL 2024 Auction: ఐపీఎల్ వేలంలో మనీశ్ పాండే, స్టీవ్ స్మిత్, కరుణ్ నాయర్ లకు షాక్..
IPL: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన టాప్-10 ప్లేయర్స్ ..