Jake Fraser-McGurk : వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతున్న రిషబ్ పంత్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ కు ఐపీఎల్ 2024 సీజన్ లో రెండో విజయం అందుకుంది. లక్నోతో జరిగిన ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన ఢిల్లీ యంగ్ ప్లేయర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ బ్యాట్ తో దుమ్మురేపాడు.
Who is Jake Fraser-McGurk : ఐపీఎల్ 2024 లో 26వ మ్యాచ్ లో ఢిల్లీ-లక్నోలు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ తో అదరగొట్టగా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ బ్యాట్ ఇరగదీశాడు. దీంతో లక్నో పై ఢిల్లీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో టీమ్ ఈ మ్యాచ్ లో 167/7 (20) పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 39, రాహుల్ బదోని 55, అర్షద్ ఖాన్ 20 పరుగులతో కొట్టారు. బౌలింగ్ లో ఇషాంత్ శర్మ 2, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసుకున్నాడు. 168 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలోనే 170 పరుగులు చేసి ఈ సీజన్ లో రెండో విజయాన్ని అందుకుంది. ఢిల్లీ బ్యాటర్లలో పృథ్వీ షా 32, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ 55, రిషబ్ పంత్ 41 పరుగుల ఇన్నింగ్స్ తో మెరిశాడు.
అరంగేట్రంలోనే అద్భుత ఇన్నింగ్స్ తో దుమ్మురేపాడు..
రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ కు ఐపీఎల్ 2024 ఆరంభం అంత గొప్పగా లేదు. తొలి 5 మ్యాచుల్లో ఆ జట్టు కేవలం ఒకటి మాత్రమే గెలుచుకోగలిగింది. కానీ 6వ మ్యాచ్ లో 22 ఏళ్ల ఒక అరంగేట్రం యువ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ టెన్షన్ కు తెరదించాడు. 22 ఏళ్ల ఫ్రేజర్ మెక్ గుర్క్ తన తొలి ఐపీఎల్ మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ తో లక్నోకు చుక్కలు చూపించాడు. ఢిల్లీకి అద్భుత విజయాన్ని అందించాడు. ఈ యంగ్ ప్లేయర్ కృనాల్ పాండ్యాను టార్గెట్ చేస్తూ పరుగుల వరదపారిస్తూ హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు.
సిక్సర్లతోనే డీల్..
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ నుంచి అత్యుత్తమ బౌలింగ్ కనిపించింది. దీంతో లక్నో జట్టు స్కోరు 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. 168 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్ పృథ్వీ షా 32 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించాడు. అయితే, వికెట్లు పడిపోయిన క్రమంలో క్రీజులోకి వచ్చిన జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్.. వస్తూవస్తూనే వెంటనే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఫ్రేజర్ కేవలం 35 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 55 పరుగులు సాధించాడు.
కృనాల్ పాండ్యా బౌలింగ్ ను చిత్తుచేస్తూ..
కృనాల్ పాండ్యా వేసిన ఓవర్లో జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత ఒత్తిడికి గురైన కృనాల్ ఆ ఓవర్లో రెండు వైడ్ బంతులు విసిరాడు. కెప్టెన్ రిషభ్ పంత్ కూడా మరో ఎండ్ నుంచి లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పంత్ 24 బంతుల్లో 2 సిక్సర్లు, 4 ఫోర్లతో 41 పరుగులు చేశాడు. కుల్దీప్ యాదవ్ కూడా కీలక పాత్ర పోషించిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు వికెట్లు పడగొట్టి లక్నోను భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. ఐపీఎల్ 2024లో ఢిల్లీకి ఇది రెండో విజయం.
ఎవరీ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్?
ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రేజర్ మెక్ గుర్క్ ధనాధన్ భారీ హిట్టింగ్ కు బ్యాటింగ్ కు పెట్టింది పేరు. లిస్ట్ ఏ లో ఎన్నో సూపర్ ఇన్నింగ్స్ లు ఆడాడు. ఈ క్రమంలోనే ఫ్రేజర్ కేవలం 29 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. దీంతో ఒక్కసారిగా ఈ యంగ్ ప్లేయర్ వెలుగులోకి వచ్చాడు. అలాగే, ఫ్రేజర్ 2020లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ లో కూడా పాల్గొన్నాడు. 2024 ఆరంభంలో వెస్టిండీస్ తో జరిగిన వన్డేలో అరంగేట్రం చేశాడు. రెండు మ్యాచ్ లను ఆడిన జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 51 పరుగులు చేశాడు.
Maiden IPL FIFTY for Jake Fraser-McGurk on DEBUT!
Hat-trick of sixes in this thoroughly entertaining knock 💥💥💥
Watch the match LIVE on and 💻📱 | pic.twitter.com/0hXuBkiBr3
ఒకే ఫ్రేమ్ లో సచిన్, ధోని, రోహిత్.. ఈ క్రికెట్ లెజెండ్స్ అసలు ఏం చేయాలనుకుంటున్నారు...?