Kuldeep Yadav : దాని కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాను.. కుల్దీప్ ఎమోష‌న‌ల్..

By Mahesh Rajamoni  |  First Published Apr 13, 2024, 12:17 AM IST

DC vs LSG Highlights : ఐపీఎల్ 2024 లో 26వ మ్యాచ్ లో ఢిల్లీ-లక్నోలు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ తో అద‌ర‌గొట్ట‌గా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ బ్యాట్ తో ఇర‌గ‌దీశాడు. దీంతో ల‌క్నో పై ఢిల్లీ విజ‌యం సాధించింది. 
 


Kuldeep Yadav's emotional comments : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024) 26వ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో త‌ల‌ప‌డ్డాయి. లక్నోలోని బీఆర్ఎస్ఏబీవీ ఎకానా క్రికెట్ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో బౌలింగ్, బ్యాటింగ్ లో అద‌ర‌గొట్టి ల‌క్నోపై ఢిల్లీ విజ‌యం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ చేయ‌కుండా ల‌క్నో దెబ్బ‌కొట్టి ఢిల్లీ గెలుపులో కీల‌క పాత్ర పోషించాడు కుల్దీప్ యాద‌వ్. అద్భుత‌మైన త‌న బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో 3 వికెట్లు తీసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే కుల్దీప్ యాద‌వ్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న త‌ర్వాత కుల్దీప్ యాద‌వ్ మాట్లాడుతూ.. తాను ఫామ్ లో లేని స‌య‌మంలో ఫిట్ నెస్ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్దాన‌ని తెలిపాడు. అలాగే, డీఆర్ఎస్ తీసుకోవ‌డం పై కూడీ కామెంట్స్ చేశాడు.  "నేను ఫిట్ గా లేనప్పుడు దానిని సాధించ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. తొలి మ్యాచ్ లో గాయపడటంతో మిడిల్ ఓవర్లలో జట్టు కష్టాల్లో పడింది. నా ఫిట్నెస్ ను కాపాడుకునీ, నన్ను త్వరగా సిద్ధం చేసిన క్రెడిట్ పాట్రిక్ (ఫర్హార్ట్)కు దక్కుతుంది. ఈ మూడూ కీలక వికెట్లు కావడంతో రన్ రేట్ ను త‌గ్గించ‌డానికి   మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం కీలకం. నాకు మొదటి, రెండవ వికెట్ తీయడం నచ్చింది, నికోల‌స్ పూరన్ ను ఔట్ చేయ‌డానికి ప్ర‌త్యేక వ్యూహంతో బౌలింగ్ కు దిగాను. అది ఫ‌లించింది" అని తెలిపాడు.

Latest Videos

DC vs LSG : మయాంక్ యాదవ్, అన్రిచ్ నోర్జే ఎందుకు ఆడటం లేదు?

అలాగే, త‌న వ్యూహాలు, బౌలింగ్ ప్లాన్స్ పై ఖ‌చ్చిత‌మైన నిర్ణ‌యాల‌తో ఉన్నాన‌ని తెలిపాడు. బౌల‌ర్ గా డీఆర్ఎస్ లు తీసుకోవ‌డం అవ‌స‌ర‌మైన టైమ్ లో తీసుకోవ‌డం ముఖ్య‌మని తెలిపాడు.  "నా ప్రణాళికలపై నేను స్పష్టంగా ఉన్నాను, స్పిన్నర్ గా నాకు పొడవు మాత్రమే ముఖ్యం. నా నైపుణ్యాలతో చాలా స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో ఉంది. డీఆర్ఎస్ కాల్ 50/50 అని నాకు అనిపించినప్పుడల్లా, నేను దాని కోసం ఒత్తిడి చేయడానికి ప్రయత్నిస్తాను, కానీ అది 60/40 కంటే ఎక్కువ ఉన్నప్పుడు నేను రిషబ్ చెప్పేది వింటాను. ఒక బౌలర్ గా వీలైనప్పుడల్లా డీఆర్ఎస్ ను తీసుకోవాలనుకుంటున్నారు. మాకు 2 సమీక్షలు ఉన్నాయి, కాబట్టి ఒకటి స్పష్టంగా నా కోసం" అంటూ న‌వ్వాడు కుల్దీప్ యాద‌వ్.

కాగా, ఈ మ్యాచ్ లో ల‌క్నో టీమ్ 167/7 (20) ప‌రుగులు చేయ‌గా, కేఎల్ రాహుల్ 39, రాహుల్ బ‌దోని 55, అర్షద్ ఖాన్ 20 ప‌రుగుల‌తో మెరిశాడు. బౌలింగ్ లో ఇషాంత్ శ‌ర్మ 2, కుల్దీప్ యాద‌వ్ 3 వికెట్లు తీసుకున్నాడు. 168 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ 4 వికెట్లు కోల్పోయి  18.1 ఓవ‌ర్ల‌లోనే 170 ప‌రుగులు చేసి ఈ సీజ‌న్ లో రెండో విజ‌యాన్ని అందుకుంది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో పృథ్వీ షా 32, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ 55, రిష‌బ్ పంత్ 41 ప‌రుగుల ఇన్నింగ్స్ తో మెరిశాడు. జేక్ ఫ్రేజర్ కు ఇది తొలి మ్యాచ్. అయితే, ఐపీఎల్ అరంగేట్రంలోనే అద్భుత‌మైన షాట్స్ ఆడుతూ అంరంభాన్ని అద‌ర‌గొట్టాడు. 31 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. 2 ఫోర్లు, 5 సిక్స‌ర్ల‌తో 55 ప‌రుగులు కీల‌క‌మైన ఇన్నింగ్స్ ఆడాడు.

DC VS LSG HIGHLIGHTS : ల‌క్నోను దెబ్బ‌కొట్టిన కుల్దీప్.. అదరగొట్టిన జేక్ ఫ్రేజర్.. ఢిల్లీ గెలుపు

click me!