Virat Kohli hug: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు. ఈ దిగ్గజ ప్లేయర్ ను ఎక్కడ చూసినా క్రికెట్ అభిమానుల క్రేజ్ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ సందర్భంగా ఓ అభిమాని సెక్యూరిటీ కన్నుగప్పి గ్రౌండ్ లోకి దూకి.. కోహ్లీ కౌగిలితో తన కల నెరవేరిందని పేర్కొన్నాడు.
Virat Kohli fans viral video: ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం భారత్- అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో ఓ క్రికెట్ అభిమాని మైదానంలో విరాట్ కోహ్లీని కౌగిలించుకున్నాడు. అక్కడి సెక్యూరిటీ గార్డులు కన్నుగప్పి గ్రౌండ్ లోకి ప్రవేశించిన అతన్ని ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చారు. విరాట్ ను చూసిన ఆనందంలో తన అభిమానం చాటుకుంటూ.. దగ్గరకు వెళ్లగా, మొదట ఆ అభిమాని షాక్ తిన్నా విరాట్ మాత్రం సహనం కోల్పోలేదు. అభిమానుల భావోద్వేగాలకు అనుగుణంగా నడుచుకోవడంలో విరాట్ చాలా సార్లు ఆదర్శంగా నిలిచారు.
తనకోసం అక్కడ భద్రతా ఉల్లంఘనకు పాల్పడుతూ.. తన అభిమాని మైదానంలోకి వచ్చిన వెంటనే అతన్ని సెక్యూరిటీ గార్డులు కొట్టకుండా చూసుకునే ప్రయత్నం చేశాడు విరాట్. ఇండోర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో అతను ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. విరాట్ 14 నెలల తర్వాత అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ లో పెద్దగా స్కోరు చేయలేకపోయాడు. కానీ కొన్ని మంచి షాట్లు ఆడాడు. విరాట్ ఉన్నతం సేపు కోహ్లీ కోహ్లీ అంటూ గ్రౌండ్ మారుమోగిపోయింది.
సచిన్ టెండూల్కర్ డీప్‌ఫేక్ వీడియో వైరల్.. మాస్టర్ బ్లాస్టర్ రియాక్షన్ ఇదే.. !
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు. ఈ దిగ్గజ ప్లేయర్ ను ఎక్కడ చూసినా క్రికెట్ అభిమానుల క్రేజ్ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ సందర్భంగా ఓ అభిమాని సెక్యూరిటీ కన్నుగప్పి గ్రౌండ్ లోకి దూకి.. కోహ్లీ కౌగిలితో తన కల నెరవేరిందని పేర్కొన్నాడు. దీనికి సంబంధించి దృశ్యాలు వైరల్ గా మారాయి. విరాట్ కోహ్లీని కౌగిలించుకోవాలన్న నా కోరిక ఈ రోజు నెరవేరిందని ఆరవ్ అనే హ్యాండిల్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. "సెక్యూరిటీ కంచె దాటి మైదానంలోకి ప్రవేశించి కింగ్ కోహ్లీని కలిశాను. ఇది నా జీవితంలో అతిపెద్ద విజయం" అంటూ తన ఆనందం వ్యక్తం చేశాడు.
My wish of hugging Virat Kohli got fulfilled today ❤️pic.twitter.com/r0B8ZjE0Ui https://t.co/vjCWSPyY9e
— Aarav (@sigma__male_)టీ20 వరల్డ్ కప్ కు సిద్ధమవుతున్న విరాట్..
2023 వన్డే ప్రపంచకప్ లో సత్తా చాటిన విరాట్ కోహ్లీ.. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. 2022 టీ20 వరల్డ్ కప్ లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది జూన్ లో వెస్టిండీస్, అమెరికాలో జరిగే టీ20 వరల్డ్ కప్ లో మళ్లీ భారత జట్టు తరఫున ఆడేందుకు విరాట్ సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి జట్టులోకి తీసుకుకోవడం ఖాయం. ఫిట్ నెస్ విషయంలో విరాట్ స్టామినా ఎంటో అందరికీ తెలిసిందే. నైపుణ్యం, అనుభవంలో అందరికంటే ముందున్నాడు. రోహిత్ శర్మ కూడా టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో ఉండే అవకాశం ఉంది. ఈ ఇద్దరు అనుభవజ్ఞులైన క్రికెటర్లతో యువ ఆటగాళ్లు జట్టులో ఉండనున్నారు.
నేను అలా ఆడటానికి ధోనియే కారణం.. శివమ్ దుబే