నేను అలా ఆడ‌టానికి ధోనియే కార‌ణం.. శివ‌మ్ దుబే

By Mahesh Rajamoni  |  First Published Jan 15, 2024, 7:00 PM IST

Shivam Dube: భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ టీ20 సిరీస్ లో భార‌త యంగ్ ప్లేయ‌ర్ శివ‌మ్ దుబే అద‌ర‌గొడుతున్నాడు. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో వ‌రుస‌గా రెండు మ్యాచ్ ల‌లో హాఫ్ సెంచ‌రీలు కొట్టాడు. అయితే, తాను ఇలా ఆడ‌టం వెనుక టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, చెనై సూప‌ర్ కింగ్స్ టీమ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉన్నార‌ని శివ‌మ్ దుబే తెలిపాడు.
 


Shivam Dube-MS Dhoni:టీమిండియా యంగ్ ప్లేయ‌ర్ శివ‌మ్ దుబే భార‌త్-ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ తో భాగంగా జ‌రిగిన రెండు టీ20 మ్యాచ్ ల‌లో బ్యాట్, బాల్ తో ఆల్ రౌండ్ షోతో అద‌ర‌గొట్టాడు. ఈ టీ20 సిరీస్ లో తొలి రెండు మ్యాచుల్లో వరుస హాఫ్ సెంచరీలు సాధించి భార‌త్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. అయితే, తాను ఇలా విజ‌య‌వంత‌మైన ఆట‌ ఆడ‌టం వెనుక భార‌త దిగ్గ‌జ ప్లేయ‌ర్, మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని (ఎంఎస్ ధోని), చెన్నై సూప‌ర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉన్నార‌ని శివ‌మ్ దుబే తెలిపాడు. అందుకే రెండో టెస్టు మ్యాచ్ లో త‌న ఇన్నింగ్స్ వారికి అంకిత‌మిస్తున్న‌ట్టు తెలిపాడు.

విరాట్ కోహ్లీ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన బాబర్ ఆజం.. !

Latest Videos

ప్ర‌స్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్న శివమ్ దూబే.. భార‌త్-అఫ్గానిస్థాన్  టీ20 సిరీస్ తో అద్భుత‌మైన ఆట‌తో అద‌ర‌గొడుతున్నాడు. తొలి టీ20లో 40 బంతుల్లో అజేయంగా 60 పరుగులు చేశాడు. ఆదివారం ఇండోర్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్ లో 32 బంతుల్లోనే అజేయంగా 63 పరుగులు చేసి భార‌త్ జ‌ట్టుకు విజ‌యం అందించాడు. ఈ సిరీస్ లో భారత జట్టు తొలి రెండు మ్యాచ్ విజ‌యంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత దూబే మాట్లాడుతూ త‌న ఆట గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. తన బ్యాటింగ్ విజయానికి చెన్నై సూపర్ కింగ్స్, కెప్టెన్ ఎంఎస్ ధోనీ, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కారణమని పేర్కొంటూ.. చెన్నై సూప‌ర్ కింగ్ స్ త‌ర‌ఫున ఆడుతున్నప్పుడు వారు త‌న‌కు చాలా స్వేచ్ఛనిచ్చార‌నీ, చాలా అవ‌కాశాలు కూడా క‌ల్పించార‌ని తెలిపాడు.

సచిన్ టెండూల్క‌ర్ డీప్‌ఫేక్‌ వీడియో వైరల్‌.. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ రియాక్ష‌న్ ఇదే.. !

'నా బ్యాటింగ్ సక్సెస్ క్రెడిట్ చెన్నై సూపర్ కింగ్స్, కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నాలోని ఆటను గుర్తించి చాలా అవకాశాలు ఇచ్చారు. నాలోని అత్యుత్తమ ప్రతిభను వెలికి తీయడంలో వారు కీల‌క పాత్ర పోషించాడు' అని ఒక‌ ఇంటర్వ్యూలో దూబే పేర్కొన్నాడు. కాగా, ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం అఫ్గానిస్థాన్  ఉంచిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో శివమ్ దూబే అద్భుత ప్రదర్శన చేశాడు. శివమ్ దూబే 32 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఐదు ఫోర్లతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ‌రో యంగ్ ప్లేయ‌ర్ యశస్వి జైస్వాల్ ఆఫ్ఘ‌న్ బౌలింగ్ చీల్చిచెండాడి 68 పరుగులు చేశాడు.

India vs Afghanistan: మ‌ళ్లీ నిరాశపరిచిన రోహిత్ శ‌ర్మ‌.. ఇలా అయితే కష్టమే.. !

click me!