నీ మొగుడితో తప్ప అందరితో కనబడుతున్నావ్..! చహాల్ భార్యపై ఆగని ట్రోలింగ్

Published : Feb 27, 2023, 06:59 PM IST
నీ మొగుడితో తప్ప అందరితో కనబడుతున్నావ్..! చహాల్ భార్యపై ఆగని ట్రోలింగ్

సారాంశం

Dhanashree Verma: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహాల్ భార్య ధనశ్రీ వర్మ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్   ప్రవాహంలా కొనసాగుతోంది.  ఆమె  చేస్తున్న పనులు కూడా నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. 

కావాలని పోస్ట్ చేస్తుందో లేక ఇద్దరి మధ్య  ఏవైనా విభేదాలు వచ్చాయో తెలియదుగానీ  టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్  భార్య ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో ఏం పోస్ట్ పెట్టినా నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నది.   గత కొన్నాళ్లుగా ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేదని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.  నిప్పులేనిదే పొగ రాదన్నట్టు.. తమ మధ్య భేదాభిప్రాయలు ఏమీ లేవని.. అంతా  బాగానే ఉందని చహాల్ చెప్పినా ధనశ్రీ మాత్రం తన  పోస్టులలో  ఆ క్లారిటీని ఇవ్వడం లేదు.   కొద్దిరోజులుగా ఆమె చేస్తున్న పోస్టులు కూడా ఇందుకు అగ్గికి ఆజ్యం పోసినట్టే ఉన్నాయి. 

తాజాగా  ధనశ్రీ.. టీమిండియా  బౌలర్ శార్దూల్ ఠాకూర్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కు హాజరైంది. ఈ  కార్యక్రమంలో   ఆమె..  రోహిత్ సింగ్ భార్య  రితికా సర్దేశాయ్ తో పాటు శార్దూల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్, రోహిత్ శర్మలతో కలిసి ఫోటోలు  దిగింది. ఈ ఫోటోలను ఆమె ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయగా అవి కాస్తా  నెట్టింట వైరల్ అయ్యాయి. 

ధనశ్రీ ఈ పోస్టు చేసిన తర్వత   నెటిజన్లు ఎప్పటిమాదిరిగానే అగ్గి మీద గుగ్గిల్లంలా  చిటపటలాడారు. ‘చహాల్ ఎక్కడ..? చహాల్ ఎక్కడ..?’అని ధనశ్రీని కామెంట్స్  లలో నిలదీశారు. పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఈ ఫోటో తీసింది చహాలేనా..? ఆఖరికి  నీ భర్తను ఫోటోగ్రాఫర్ చేశావా..!’,  ‘ఫోటో తీస్తున్న చహాల్.. స్మైల్ ప్లీజ్ అనుంటాడు.. అందుకే అందరూ పళ్లు ఇకిలిస్తున్నారు..’, ‘అదేంటోగానీ నీ భర్తతో తప్ప అందరితోనూ కనబడుతున్నావ్.. పాపం చహాల్..’అని కామెంట్స్ చేస్తున్నారు.  

 

రెండ్రోజుల క్రితం ధనశ్రీ.. మాల్దీవులలో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. అందులో కూడా చహాల్ ను తప్ప మిగతా గెస్ట్ లు అందరితో  బికినీలో ఆడిపాడి రచ్చ చేసింది.   వీడియో తీస్తూనే  బికినీలో తన అందాలను వంగి వంగి వడ్డించింది.  గత కొంతకాలంగా ఆమె అందాల ప్రదర్శనకు దిగుతున్న విషయం తెలిసిందే. తాజా వీడియోలో చహాల్ పక్కనున్నా ఇతర గెస్ట్ లు ఉండగానే అందాల వడ్డింపు డోస్ పెంచడం గమనార్హం. 

 

ఈ వీడియోపై నెటిజన్లు  మండిపడ్డారు. ‘అసలు నువ్వు చహాల్ ను ఎందుకు పట్టించుకోవడం లేదు..? ప్రతీసారి నీ భర్తను నువ్వు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావ్...?’ అని  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఓ నెటిజన్.. ‘చహాల్ ను నీ బిల్లులు కట్టేందుకు తీసుకెళ్లావా..?’అని రాసుకొచ్చాడు.  ‘పాపం చహాల్.. ఈ ప్రపంచంలో అతడి కంటే దురదృష్టవంతుడు మరొకడు ఉండడు. తన ముందే  భార్య  వేరే మగాళ్లతో బికినీలలో డాన్సులు చేస్తుంటే చూస్తూ కూర్చోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు..’ అని  కామెంట్ చేశారు.    

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !