ఉమెన్స్ వరల్డ్ కప్ లో టీమ్ ఆఫ్ ది టోర్నీ ఇదే.. భారత్ నుంచి ఒకే ఒక్క ప్లేయర్..

Published : Feb 27, 2023, 05:34 PM IST
ఉమెన్స్ వరల్డ్ కప్ లో టీమ్ ఆఫ్ ది టోర్నీ ఇదే.. భారత్ నుంచి ఒకే ఒక్క ప్లేయర్..

సారాంశం

ICC Womens T20 World Cup 2023: దక్షిణాఫ్రికాలో ముగిసిన   మహిళల టీ20 ప్రపంచకప్  లో ఆస్ట్రేలియా జట్టు  ఆరోసారి టైటిల్ గా నిలిచన విషయం తెలిసిందే.   తాజాగా ఐసీసీ ఈ టోర్నీలో టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ను ప్రకటించింది. 

సౌతాఫ్రికా వేదికగా  సుమారు 20 రోజుల పాటు అలరించిన ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్  లో  ఆదివారం ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికాల మధ్య ఫైనల్ జరిగిన విషయం తెలిసిందే.   ఈ మ్యాచ్ లో  ఆసీస్.. సౌతాఫ్రికా పై 19 పరుగుల తేడాతో గెలుపొందింది.  టీ20లలో  ఆస్ట్రేలియాకు ఇది వరుసగా  రెండో టైటిల్ కాగా మొత్తంగా ఏడోవది.   అయితే  టోర్నీ ముగిశాక  ఐసీసీ..  టీమ్  ఆఫ్ ది టోర్నమెంట్ ను  ప్రకటించింది. ఈ జాబితాలో భారత జట్టు నుంచి ఒకే ఒక ప్లేయర్ చోటు దక్కించుకుంది. 

ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ నటాలి సీవర్ సారథిగా ఉన్న ఈ  టీమ్ లో  టీమిండియా వికెట్ కీపర్  రిచా ఘోష్ చోటు దక్కించుకుంది.  12 మందితో కూడిన జట్టును ఐసీసీ ప్రకటించింది. ఆ జాబితాను ఇక్కడ చూద్దాం. 

అప్‌స్టాక్స్  మోస్ట్ వాల్యూబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ పేరుతో ఐసీసీ ప్రకటించిన ఈ జట్టులో నలుగురు ఆస్ట్రేలియా క్రికెటర్లు,  ముగ్గురు దక్షిణాఫ్రికా, ఇద్దరు ఇంగ్లాండ్  ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు.  భారత్, వెస్టిండీస్, ఐర్లాండ్ నుంచి  నుంచి ఒకరి చొప్పున  ప్లేయర్లున్నారు.  

ఓపెనర్ గా సఫారీ ప్లేయర్ టజ్మిన్ బ్రిట్స్ (186 పరుగులు), అలీస్సా హీలి  (ఆస్ట్రేలియా -  189 రన్స్) ఉన్నారు. వన్ డౌన్ లో   దక్షిణాఫ్రికా ఓపెనర్  లారా వోల్వార్ట్ (230 రన్స్)  ఉండగా నాలుగో స్థానంలో  సారథి సీవర్ (ఇంగ్లాండ్ - 216 రన్స్)  ఉంది. ఈ జాబితాలో తర్వాత  ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆష్ గార్డ్‌నర్  (110 రన్స్, 10 వికెట్లు), రిచా ఘోష్ (136 రన్స్,  ఏడుగురిని ఔట్  చేసింది), సోఫీ ఎక్లిస్టోన్ (ఇంగ్లాండ్ - 11 వికెట్లు) , కరిష్మా రమ్హరక్ (విండీస్ - ఐదు వికెట్లు) ఉన్నారు. ఆ తర్వాత సౌతాఫ్రికా పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్ (8 వికెట్లు) ఉండగా ఏడు వికెట్లు తీసిన ఆస్ట్రేలియా పేసర డార్సీ బ్రౌన్ తర్వాతి స్థానంలో నిలిచింది. మరో ఆసీస్ పేసర్ మేగన్ (10 వికెట్లు) తో పాటు 12వ ప్లేయర్ గా ఐర్లాండ్ ఆల్ రౌండర్ ఒర్ల ప్రెండర్గస్ట్ (106 రన్స్, 3 వికెట్స్) నిలిచింది. 

 

టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా వోల్వార్ట్ (దక్షిణాఫ్రికా - 230) నిలవగా  తర్వాత సీవర్ (216), బెత్ మూనీ (206), హీలి (189), బ్రిట్స్ (186) లు ఉన్నారు. భారత్ నుంచి స్మృతి మంధాన.. 151 పరుగులతో టాప్ - 6 లో నిలిచింది. 

అత్యధిక వికెట్ల జాబితాలో ఎక్లిస్టోన్ (ఇంగ్లాండ్ - 11 వికెట్లు)  అగ్రస్థానంలో నిలవగా మేగన్ (10), గార్డ్‌నర్ (10), మారిజనె కాప్ (9), ఇస్మాయిల్ (8) లు టాప్ - 5 లొ నిలిచారు.  భారత్ నుంచి రేణుకా సింగ్ ఠాకూర్.. ఏడు వికెట్లతో టాప్ - 10 లో పదో స్థానంలో నిలిచింది. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !