ఆరేడు నెలలు ఆడలేదు, ఇక అంతే: ధోనీ భవితవ్యంపై కపిల్ దేవ్

Published : Feb 03, 2020, 08:29 PM IST
ఆరేడు నెలలు ఆడలేదు, ఇక అంతే: ధోనీ భవితవ్యంపై కపిల్ దేవ్

సారాంశం

ఎంఎస్ ధోనీ భవితవ్యంపై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆరేడు నెలలు ఆటకు దూరంగా ఉన్నావంటే రీఎంట్రీ కష్టమేనని కపిల్ దేవ్ అన్నాడు.

ముంబై: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భవితవ్యంపై భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ కప్ తర్వాత ధోనీ మల్లీ మైదానంలో కనిపించలేదని, దాదాపు ఆరు నెలలు ఆటకు దూరంగా ఉంటే రీఎంట్రీ ఇవ్వడం అంత సాధారణమైన విషయం కాదని, తిరిగి ఆటలోకి రావడం సందేహంగానే ఉంటుందని ఆయన అన్నాడు. 

అయితే ధోనీకి ఐపిఎల్ రూపంలో మంచి అవకాశం ఉందని, అక్కడ ధోనీ రాణిస్తే బీసీసీఐ నుంచి మళ్లీ పిలుపు రావచ్చునని ఆయన అన్నాడు. ఐపిఎల్ లో ఆడే ఆటతోనే ధోనీ భవితవ్యం ఆధారపడి ఉంటుందని ఆయన మీడియాతో అన్నాడు. లేకపోతే ధోనీని జట్టులోకి తీసుకోవడం చాలా కష్టమని ఆయన అన్నాడు. 

Also Read: ఆయనే సాధించాడు, అందుకే అందరిలోకి ధోనీ బెస్ట్ కెప్టెన్: రోహిత్ శర్మ

ధోనీ భారత క్రికెట్ కు ఎంతో సేవ చేశాడని, కానీ ఆరు నెలల పాటు జట్టుకు దూరంగా ఉంటే రిటైర్మెంట్ మీద సందేహాలు రావడం సహజమని ఆయన అన్నాడు. ఐపిఎల్ ప్రారంభమైన తర్వాత ధోనీ ఆడే ఆటను బట్టి ఆధారపడి ఉంటుందని, అంతేకాకుండా ఇతర ఆటగాళ్లు ఎలా రాణిస్తారు, ధోనీని వ్యతిరేకించేవాళ్లు వారి ఫామ్ ను చూసే తీరును బట్టి కూడా ధోనీ భవితవ్యం ఆధారపడి ఉంటుందని భారత కోచ్ రవిశాస్త్రి అన్నాడు.

మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ పై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిరుడు జరిగిన వన్డే ప్రపంచ కప్ ఓటమి తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ దూరంగా ఉన్నాడు. ఇటీవల బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్టు జాబితాలో కూడా ధోనీ పేరు లేదు. దీంతో ధోనీ భవితవ్యంపై సందేహాలు పెరిగాయి. 

Also Read: ఇండియాకు షాక్: కివీస్ పై వన్డే, టెస్టు సిరీస్ లకు రోహిత్ శర్మ దూరం

ఆ నేపథ్యంలో ధోనీ పునరాగమనంపై రవిశాస్త్రి కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఐపిఎల్ లో రాణించకపోతే ఎంఎస్ ధోనీ స్వయంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునే అవకాశాలున్నాయని ఆయన అన్నాడు.

PREV
click me!

Recommended Stories

Smriti Mandhana : పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది.. మౌనం వీడిన స్మృతి మంధాన !
Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు