ఆయనే సాధించాడు, అందుకే అందరిలోకి ధోనీ బెస్ట్ కెప్టెన్: రోహిత్ శర్మ

By telugu teamFirst Published Feb 3, 2020, 6:30 PM IST
Highlights

టీమిండియా కెప్టెన్లందరిలోకి ఎంఎస్ ధోనీ అత్యుత్తమ కెప్టెన్ అని రోహిత్ శర్మ ప్రశంసించాడు. మూడు ప్రపంచ కప్ టైటిల్స్ ను ధోనీ ఇండియాకు అందించాడని ఆయన అన్నాడు. కూల్ గా నిర్ణయాలు తీసుకోవడం వల్లనే విజయాలు సాధించాడని రోహిత్ శర్మ అన్నాడు.

మౌంట్ మాంగని: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఇండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రశంసలతో ముంచెత్తాడు. భారత్ కు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన కెప్టెన్లలో ధోనీ బెస్ట్ కెప్టెన్ అని ఆయన అన్నాడు. ప్రశాంత స్వభావం కలిగిన కెప్టెన్ అని ఆయన అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ నిలకడగా రాణించడానికి, విజయాలు సాధించడానికి ధోనీ నాయకత్వం కూడా ఓ కారణమని అయన అన్నాడు.  

దోనీ నాయకత్వంలోనే ఇండియా మూడు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుంది. 2007లో ఐసిసి టీ20 ప్రపంచ కప్ ను, 2011లో ప్రపంచ కప్ ను, 2013లో చాంపియన్స్ ట్రోఫీని ధోనీ అందించాడు. ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) 2010, 2011 ఐపిఎల్ టైటిల్స్ ను గెలుచుకుంది. 

Also Read: ఇండియాకు షాక్: కివీస్ పై వన్డే, టెస్టు సిరీస్ లకు రోహిత్ శర్మ దూరం

ఎంఎస్ ధోనీని అందుకు భారతదేశం యావత్తూ ఇష్టపడుతుందని, ప్రశాంతంగా ఉండడం వల్ల మైదానంలో మంచి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ధోనీకి ఉందని, మూడు ఐపిఎల్ ట్రోఫీలను, పలు ఐపిఎల్ టైటిల్స్ ను గెలిపించిన ధోనీ భారత కెప్టెన్లలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ అని రోహిత్ శర్మ ఓ వీడియోలో ఉన్నాడు.

 

ఒత్తిడిలోనూ కూల్ గా, నిబ్బరంగా ఉండడం వల్ల ధోనీ విజయాలు అందుకున్నాడని రోహిత్ శర్మ అన్నాడు. చాలా మంది యువ బౌలర్లు ఒత్తిడికి గురైనట్లు వారిని సంసిద్దం చేసిన విధానాన్ని తాను చూశానని, మెడపై చేతులు వేసి ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పేవాడని రోహిత్ శర్మ అన్నాడు. 

జట్టులోని సీనియర్ సభ్యుడు యువ ఆటగాళ్ల పట్ల ఆ విధంగా ప్రవర్తించినప్పుడు వారిలో విశ్వాసం పెరిగి జట్టు కోసం ఫలితాలు అందిస్తారని ఆయన అన్నాడు. 

Also Read: రోహిత్ శర్మకు గాయం: కేఎల్ రాహుల్ స్పందన ఇదీ..

click me!