Super Over in cricket: భారత్-ఆఫ్ఘనిస్తాన్ 3వ టీ20 మస్తు క్రేజీగా డబుల్ సూపర్ ఓవర్ తో ఫలితం వచ్చింది. రెండు జట్లు 40 ఓవర్లలో ఏకంగా 423 పరుగలు కోట్టారు. అయినా ఫలితం రాలేదు. సూపర్ ఓవర్ కు వెళ్లారు అయినా మళ్లీ సేమ్ రిజల్ట్.. క్రికెట్ లో సరికొత్త చరిత్రగా రెండో సారి సూపర్ ఓవర్ వెళ్లిన మ్యాచ్ లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అయితే, రెండో సూపర్ ఓవర్ కూడా టై అయివుంటే..?
What happens after 2 super overs: భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 212 పరుగుల చేసింది. మ్యాచ్ టై అయింది. రెండు జట్లు 40 ఓవర్లలో ఏకంగా 423 పరుగలు కోట్టారు. అయినా ఫలితం రాలేదు. సూపర్ ఓవర్ కు వెళ్లారు అయినా మళ్లీ సేమ్ రిజల్ట్.. క్రికెట్ లో సరికొత్త చరిత్రగా రెండో సారి సూపర్ ఓవర్ వెళ్లిన మ్యాచ్ లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అయితే, రెండో సూపర్ ఓవర్ లో కూడా మ్యాచ్ టై అయివుంటే ఏం జరిగేది..? ఇది తెలుసుకునే ముందే సూపర్ ఓవర్ చరిత్రను తెలుసుకుందాం !
సూపర్ ఓవర్ అంటే ఎమిటి?
undefined
ఏదైనా ఒక క్రికెట్ మ్యాచ్ సోర్లు సమం అయినప్పుడు ఫలితం రావడానికి తీసుకువచ్చినదే సూపర్ ఓవర్. సూపర్ ఓవర్ లో ఇరు జట్లకు ఒక ఓవర్ మ్యాచ్ ఆడగాయి. టీ20 క్రికెట్ మ్యాచ్ లలో మొదట ఉపయోగించే సూపర్ ఓవర్ అనేది విజేతను నిర్ణయించడానికి టైని విచ్ఛిన్నం చేసే పద్ధతి. జట్లు అదనపు ఓవర్ ఆడతాయి. సూపర్ ఓవర్ లో ఏ జట్టు ఎక్కువ పరుగులు సాధిస్తుందో ఆ జట్టు గెలుస్తుంది. సూపర్ ఓవర్ లో కూడా మ్యాచ్ మళ్లీ టైగా ముగిస్తే మరో సూపర్ ఓవర్ ఆడతారు.
IND vs AFG: మస్తు క్రేజీ ఇది.. క్రికెట్ చరిత్రలో తొలిసారి డబుల్ సూపర్ ఓవర్ ! భారత్ గెలుపు
సూపర్ ఓవర్ చరిత్ర
టైని విచ్ఛిన్నం చేయడానికి బౌల్ అవుట్ పద్ధతిని మార్చడానికి దీనిని 2008 లో ప్రవేశపెట్టినప్పటికీ, 2011 లో వన్డే ప్రపంచ కప్ నాకౌట్ దశలో ఇది వెలుగులోకి వచ్చింది. తదనంతర ప్రపంచ కప్ మ్యాచ్ లకు, టైని నివారించడానికి సూపర్ ఓవర్ ను ఉపయోగించారు.
సూపర్ ఓవర్ నియమాలు ఏంటి?
స్టాండర్డ్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ప్లేయింగ్ కండిషన్స్ లో పేర్కొన్న లా 21.5 ప్రకారం.. మ్యాచ్ సమాన స్కోరుతో ముగిసినట్లయితే అది టైగా మారుతుంది. వికెట్ల ఖాతాను పరిగణనలోకి తీసుకోరు. మ్యాచ్ విజేతను నిర్ణయించడానికి జట్లు ప్రతి జట్టు ఎలిమినేటర్ కు ఒక ఓవర్ (సూపర్ ఓవర్) లో పోటీపడతాయి. 2012 అక్టోబర్ 1 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ప్రతి జట్టు తమ సూపర్ ఓవర్ కోసం ముగ్గురు బ్యాట్స్ మన్ ను ఎంపిక చేస్తుంది. అంటే రెండు వికెట్లు పడితే ఆలౌట్ అని అర్థం. మ్యాచ్ లో ఏ జట్టు రెండో స్థానంలో బ్యాటింగ్ చేసిందో ఆ జట్టు సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేస్తుంది.
IND vs AFG: వాట్ ఏ షాట్.. ! అద్భుతమై రివర్స్ స్విప్ షాట్ తో అదరగొట్టిన రోహిత్ శర్మ
సూపర్ ఓవర్ కూడా టై అయితే ఏంటీ పరిస్థితి?
మ్యాచ్ టై అయితే, సూపర్ ఓవర్ ఆడతాయి. సూపర్ ఓవర్ కూడా టై అయితే, మరో సూపర్ ఓవర్ ఆడతాయి. రెండో సూపర్ ఓవర్ కూడా టై అయితే..? క్రికెట్ సూపర్ ఓవర్ నిబంధనల ప్రకారం.. ఒకవేళ సూపర్ ఓవర్ కూడా టైలో ముగిస్తే, మరో సూపర్ ఓవర్ ఆడతారు. రెండో సూపర్ ఓవర్ కూడా టై అయితే, సూపర్ ఓవర్ మినహా మ్యాచ్ అంతటా సాధించిన బౌండరీల సంఖ్యను బట్టి విజేతను నిర్ణయిస్తారు. సూపర్ ఓవర్ మ్యాచ్ లో డక్వర్త్-లూయిస్-స్టెర్న్ (డీఎల్ఎస్) పద్ధతిని ఉపయోగించాల్సి వస్తే, విజేతను నిర్ధారించడానికి సూపర్ ఓవర్ కౌంట్ బ్యాక్ ప్రమాణాలకు వెళుతుంది.
కొత్తగా వచ్చిన మార్పులు గమనిస్తే..
బౌండరీ కౌంట్ ఆధారంగా ఇంగ్లాండ్ గెలిచిన 2019 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ సూపర్ ఓవర్ తరువాత, గ్రూప్ దశలో సూపర్ ఓవర్ సమమైతే, మ్యాచ్ ను టై అని పిలుస్తారు, కానీ నాకౌట్ దశలలో, విజేత వచ్చే వరకు సూపర్ ఓవర్లు పునరావృతమవుతాయని ఐసీసీ నిబంధనను మార్చింది. ఇంగ్లండ్ vs న్యూజిలాండ్ 2019 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ బౌండరీలతో విజేత ను నిర్ణయం తర్వాత భారీ విమర్శలు రావడంతో ఈ నియమం రద్దు చేశారు.
టీ20 క్రికెట్ లో ఒకేఒక్క ప్లేయర్ రోహిత్ శర్మ.. సిక్సుల మోతతో ఐదో రికార్డు సెంచరీ
భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ రెండో సూపర్ ఓవర్ కూడా టై అయివుంటే ఏం జరిగేది..?
ఇరు జట్లు స్కోర్లను సమం చేయడంతో భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు సూపర్ ఓవర్ ఆడాయి. సూపర్ ఓవర్ లో కూడా మ్యాచ్ టై అయింది. దీంతో రెండో సూపర్ ఓవర్ ఆడాయి. భారత్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. అయితే, రెండో సూపర్ ఓవర్ లో కూడా సోర్లు సమం అయివుంటే మరో సూపర్ ఓవర్ ఆడేవి. అదికూడా సూపర్ ఓవర్ అయివుంటే మరో సూపర్ ఓవర్ ఆడతాయి. ఇలా ఫలితం వచ్చేవరకు సూపర్ ఓవర్ ఆడతాయి. కానీ, దీనికంటూ ఒక సమయం ఉంటుంది. మ్యాచ్ జరిగే పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే మరో సూపర్ ఓవర్ ను ఆడతాయి. అంటే అక్కడి వాతావరణం, సమయం కీలక పాత్ర పోషిస్తాయి. తుది నిర్ణయం అంపైర్లదే అవుతుంది. ఒక రోజులో రాత్రి 12 గంటల లోపు మాత్రమే సూపర్ ఓవర్ లు ఆడటానికి నిబంధనలు అనుమతిస్తాయి.
కలలో పాము కనిపిస్తే అర్థమేంటి..? శుభమా.. అశుభమా..?