Team India: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా.. ధోని రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శ‌ర్మ‌..

By Rajesh Karampoori  |  First Published Jan 18, 2024, 1:57 AM IST

Team India: భారత కెప్టెన్ రోహిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అనంతరం అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 212 పరుగులు చేసింది. అనంతరం మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు చేరుకుంది. తొలిసారిగా టీమ్ ఇండియా ఒక మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లు ఆడాల్సి వచ్చింది. రోహిత్ సేన  ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించడంతో మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేసింది. ఇంతకీ ఆ రికార్టు ఏంటో మీకు తెలుసా?


Team India: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సూపర్‌ ఓవర్‌లో అఫ్ఘాన్‌ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. ఈ విజ‌యంతో టీమ్ఇండియా ఓ అరుదైన రికార్డును నెల‌కొల్పింది. టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు ప్ర‌త్య‌ర్ది జట్లల‌ను వైట్‌వాష్ లు చేసిన జ‌ట్టుగా టీమిండియా స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. అఫ్గానిస్తాన్‌తో సిరీస్ క‌లిపి 9 సార్లు ప్ర‌త్యర్థుల‌ను వైట్‌వాష్ చేసింది భారత్ జట్టు. ఈ క్ర‌మంలో పాకిస్తాన్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టింది. దైపాక్షిక సిరీసుల్లో పాకిస్తాన్ 8 సార్లు ప్ర‌త్య‌ర్థి జట్టు‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

ధోని రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శ‌ర్మ‌

Latest Videos

అలాగే.. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో రాణించి ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఇదే సమయంలో కెప్టెన్సీలో కూడా రోహిత్ అరుదైన ఘనత సాధించాడు. టీ20లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. టీ20ల్లో టీమ్ఇండియాకు అత్య‌ధిక విజ‌యాలు అందించిన సార‌థిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా 54 మ్యాచులు ఆడగా.. ఇందులో 42 మ్యాచ్ లో భారత్ సాధించింది. అంతకు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 72 మ్యాచ్‌లు ఆడగా.. అందులో 41 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. ఇలా టీ20లో రోహిత్ కెప్టెన్సీలో భార‌త జ‌ట్టు అధిక విజ‌యాలు సాధించ‌డంతో హిట్ మ్యాచ్ ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు. 

మ్యాచ్‌లో ఏం జరిగింది?

భారత కెప్టెన్ రోహిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు వచ్చిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 212 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా మారింది. అనంతరం మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు చేరుకుంది. తొలి సూపర్  ఓవర్ లో కూడా ఇరు జట్ల స్కోర్లు సమానమయ్యాయి. దీంతో తొలిసారిగా టీమ్ ఇండియా ఒక మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లు ఆడాల్సి వచ్చింది.

తొలి సూపర్ ఓవర్‌లో ఆఫ్ఘనిస్థాన్ 16 పరుగులు చేసింది. భారత్ 17 పరుగులు చేయాల్సి ఉండగా, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, రింకూ సింగ్ కలిసి 16 పరుగులు మాత్రమే చేయగలిగారు. అనంతరం రెండో సూపర్‌ ఓవర్‌ జరిగింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 11 పరుగులు మాత్రమే చేసింది. ఈసారి రోహిత్, రింకూ సహా సంజూ శాంసన్ బ్యాటింగ్ చేశాడు. ఆఫ్ఘనిస్థాన్‌ 12 పరుగుల లక్ష్యాని చేధించడంలో విఫలమైంది. అఫ్గాన్ జట్టు ఒక్క పరుగు మాత్రమే చేయగలిగింది. రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీశాడు. ఇలా డ‌బుల్ సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో భార‌త్ 10 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది.

అంతకు ముందు.. మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయిన 212 ప‌రుగులు చేసింది. భారత బ్యాట‌ర్ల‌లో రోహిత్ శ‌ర్మ(121నాటౌట్; 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) సెంచ‌రీ చేయ‌గా రింకూ సింగ్ (69 నాటౌట్; 39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించాడు. అఫ్గానిస్తాన్ బౌల‌ర్ల‌లో ఫరీద్ అహ్మద్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ సాధించాడు.

అనంత‌రం లక్ష్య చేధనకు వచ్చిన ఆఫ్గాన్ టీం బ్యాట్స్ మెన్స్ రాణించారు. ఇందులో గుల్బాదిన్ నాయబ్ (55 నాటౌట్‌; 23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) రెచ్చిపోయాడు. అలాగే.. ర‌హ్మానుల్లా గుర్బాజ్ (50; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), ఇబ్ర‌హీం జ‌ద్రాన్ (50; 41 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్) అర్థ సెంచ‌రీలు చేయ‌డంతో అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి స‌రిగ్గా 212 ప‌రుగులు చేసింది. దీంతో మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది.

అనంత‌రం సూప‌ర్ ఓవ‌ర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 16 ప‌రుగులు చేసింది. ఆ త‌రువాత బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా 16 ప‌రుగులే చేయ‌డంతో మ‌రో సారి సూప‌ర్ ఓవ‌ర్‌ ఆడాల్సివచ్చింది. రెండో సూప‌ర్ ఓవ‌ర్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 11 ప‌రుగులు చేయ‌గా.. ఆ తరువాత వచ్చిన  అఫ్గాన్ మూడు బంతుల్లో ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో టీమిండియా 10 ప‌రుగుల తేడాతో విజయం సాధించింది.

click me!