IND vs AFG: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య సిరీస్‌లో చివరి టీ20 మ్యాచ్‌లో ఇరు జట్టు హోరాహోరీగా పోరాడాయి. ఇరు జట్ల సోర్కులు సమానం కావడంతో సూపర్ ఓవర్ కు వెళ్లింది. ఈ ఓవర్ లో కూడా ఇరు జట్ల స్కోర్లు సమానం కావడంతో క్రికెట్ చరిత్రతో తొలిసారి ఓ మ్యాచ్ లో రెండు సార్లు సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. ఇలా ఈ నరాలు తెగే రెండో సూపర్ ఓవర్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగి చివరి మ్యాచ్‌లో భారత్ చరిత్రాత్మక విజయం సాధించింది. దీంతో 3-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.
IND vs AFG: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య సిరీస్‌లో చివరి టీ20 మ్యాచ్‌లో ఇరు జట్టు హోరాహోరీగా పోరాడాయి. ఈ మ్యాచ్ లో ఇరు జట్ల సోర్కులు సమానం కావడంతో సూపర్ ఓవర్ కు వెళ్లింది. సూపర్ ఓవర్ లో కూడా ఇరు జట్ల స్కోర్లు సమానం కావడంతో క్రికెట్ చరిత్రతో తొలిసారి ఓ మ్యాచ్ లో రెండు సార్లు సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. ఇలా ఈ నరాలు తెగే ఉత్కంఠ మధ్య రెండో సూపర్ ఓవర్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగి చివరి మ్యాచ్‌లో భారత్ చరిత్రాత్మక విజయం సాధించింది. దీంతో 3-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధన వచ్చిన అఫ్గాన్ బ్యాట్స్ మెన్స్ ధీటుగా రాణించారు. ఆఫ్గాన్ నిర్ణీత ఓవర్ 212 పరుగలు చేసింది. దీంతో మ్యాచ్ టై గా మారింది. ఇరుజట్టు సూపర్ ఓవర్ ఆడగా.. ఈ ఓవర్ లో కూడా స్కోర్స్ సమం అయ్యాయి. దీంతో అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఒకే మ్యాచ్ లో రెండు సూపర్ ఓవర్ ఆడే అవకాశం వచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన రెండో సూపర్ ఓవర్ లో భారత్ చరిత్రాత్మక విజయం సాధించింది.
undefined
మొదటి సూపర్ ఓవర్‌లో ఇరు జట్లు 16-16 పరుగులు చేశాయి. అనంతరం డబుల్ సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 11 పరుగులు చేసింది. ఆ తరువాత లక్ష్య చేధనకు వచ్చిన ఆఫ్గాన్ మూడు బంతుల్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో ఉత్కంఠభరితంగా సాగిన టీ 20 పోరులో అఫ్గానిస్థాన్ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. రెండో సూపర్ ఓవర్‌లో రవి బిష్ణోయ్ బౌలింగ్ చేయడానికి వచ్చి అతని స్పిన్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు చిక్కుకుంది. అతను కేవలం మూడు బంతుల్లో మహ్మద్ నబీ, రహ్మానుల్లా గుర్బాజ్‌ల రెండు వికెట్లు తీశాడు. సూపర్ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోవడంతో ఇన్నింగ్స్ ముగిసింది.
డబుల్ సూపర్ ఓవర్‌లో..
తొలి బంతికే రోహిత్ సిక్సర్ బాదాడు. రెండో బంతికి రోహిత్ ఫోర్ కొట్టాడు. దీంతో తొలి రెండు బంతుల్లోనే టీమిండియాకు 10 పరుగులు వచ్చాయి. మూడో బంతికి రోహిత్ ఒక పరుగు తీశాడు. నాలుగో బంతిని రింకూ ఎదుర్కొన్నాడు. కానీ, క్యాచ్ ఔట్ అయింది. వికెట్ కీపర్ గుర్బాజ్ క్యాచ్ పట్టాడు. అనంతరం శాంసన్ క్రీజ్ లోకి వచ్చాడు. కానీ, తర్వాత బంతికే రోహిత్ రనౌట్ అయ్యాడు. ఇలా భారత్ రెండు వికెట్లు కోల్పోయి..భారత్ 11 పరుగులు మాత్రమే చేయగల్గింది.
ఆఫ్ఘనిస్తాన్ తరఫున నబీ, గుర్బాజ్‌లు బ్యాటింగ్‌కు వచ్చారు. రవి బిష్ణోయ్ భారత్ తరఫున బౌలింగ్ చేసేందుకు వచ్చాడు.
తొలి బంతికే నబీ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తరువాత కరీం జనత్ బ్యాటింగ్‌కు వచ్చాడు. రెండో బంతికి ఒక్క పరుగు చేశాడు. మూడో బంతిని ఎదుర్కొవడానికి గుర్బాజ్ స్ట్రైక్ లోకి వచ్చాడు. కానీ, బిష్ణోయ్ బౌలింగ్ లో తికమకపడ్డ గుర్బాజ్ రింకూకు క్యాచ్ ఇచ్చి వెనుదిగాడు. దీంతో రెండో సూపర్ ఓవర్ లో ఆఫ్ఘనిస్థాన్ ఒక్క పరుగు మాత్రమే చేయగలిగింది.
తొలి సూపర్‌ఓవర్‌లో భారత్
భారత్, అఫ్గానిస్థాన్ మధ్య మూడో టీ20 టై అయింది. మ్యాచ్ సూపర్ ఓవర్ కు చేరుకుంది. చివరి ఓవర్‌లో ఆఫ్ఘనిస్థాన్ 19 పరుగులు చేయాల్సి ఉండగా, ఆ జట్టు 18 పరుగులు చేయగలిగడంతో స్కోరు సమమైంది. చివరి బంతికి ఆఫ్ఘనిస్తాన్ మూడు పరుగులు చేయాల్సి ఉండగా, కేవలం రెండు పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఇరుజట్ల స్కోర్లు సమానమయ్యాయి. సూపర్ ఓవర్‌లో తొలుత భారత్ తరఫున బౌలింగ్ చేయడానికి ముఖేష్ కుమార్ రాగా.. ఆఫ్ఘన్ తరుపున గుల్బాదిన్ నాయబ్, రహ్మానుల్లా గుర్బాజ్ బ్యాటింగ్‌కు దిగారు.
ఆఫ్ఘన్ ఇన్నింగ్స్
తొలి బంతిని ముఖేష్ యార్కర్ గా వేయగా.. నైబ్ రెండు పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. తర్వాత మహ్మద్ నబీ వచ్చి రెండో బంతికి పరుగు సాధించాడు. ఆ తర్వాత ముఖేష్ యార్కర్ లెంగ్త్ బంతిని వేశాడు. మూడో బంతిని గుర్బాజ్ థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీకి తరలించాడు. నాలుగో బంతికి గుర్బాజ్ ఒక పరుగు చేశాడు.ప్రవక్త స్ట్రైక్ కు వచ్చారు. ఇప్పటి వరకు మొత్తం ఏడు పరుగులు వచ్చాయి. ఐదో బంతికి నబీ సిక్సర్ కొట్టాడు. ఇక ఆరో బంతికి నబీ తప్పిపోయాడు. శాంసన్ విసిరిన బంతి కాలికి తగిలి లాంగ్ ఆన్‌కి వెళ్లింది. దీని తర్వాత నబీ కాలికి తగలడంతో బంతి పక్కకు తప్పిందని భారత ఆటగాళ్లు నిరసనకు దిగారు. అయితే.. అప్పటికి నబీ, గుర్బాజ్ చెరో మూడు పరుగులు చేశారు.
భారత్ ఇన్సింగ్స్
ఆ తరువాత భారత్ తరఫున రోహిత్, యశస్వి బ్యాటింగ్‌కు వచ్చారు. అదే సమయంలో అజ్మతుల్లా ఒమర్‌జాయ్ ఆఫ్ఘనిస్థాన్ తరఫున బౌలింగ్ చేసేందుకు వచ్చాడు. తొలి బంతికే రోహిత్ తొడకు బంతి తగిలి ఒక్క పరుగు తీశాడు. యశస్వి రనౌట్ కాకుండా తప్పించుకుంది. యశస్వి రెండో బంతిని స్కూప్ చేసేందుకు ప్రయత్నించి ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఆ తరువాత మూడో బంతికి రోహిత్ లాంగ్ ఆన్ దిశగా సిక్సర్ బాదాడు. తగ్గేదేలే అన్నట్టుగా నాలుగో బంతికి రోహిత్ ఆఫ్ సైడ్ లో అద్భుతమైన సిక్సర్ బాదాడు.
దీంతో భారత్ స్కోరు 14 పరుగులకు చేరింది. ఐదో బంతికి రోహిత్ ఒక పరుగు తీశాడు. స్కోరు 15 పరుగులకు చేరింది. ఈ క్రమంలో రోహిత్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. టీమిండియా విజయం సాధించాలంటే.. ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ క్రమంలో రింకూ సింగ్‌ను వేగంగా పరిగెత్తమని మైదానంలోకి పిలిచాడు. యశస్వి ఆఖరి బంతికి ఒక్క పరుగు మాత్రమే సాధించడంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది. ఇరు జట్లు 16-16 పరుగులు చేశాయి.