Team India Head Coach challenges : టీమిండియా ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త కోచ్‌ని ప్రకటించింది. బీసీసీఐ సెక్రటరీ జై షా సోషల్ మీడియాలో గౌతమ్ గంభీర్ ను టీమిండియా కొత్త హెడ్ కోచ్ గా నియామకాన్ని వెల్లడించారు.
Team India New Head Coach Gautam Gambhir : టీమిండియా కొత్త ప్రధాన కోచ్ గా మాజీ ఓపెనర్, ప్రపంచ చాంపియన్ ప్లేయర్ గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. మూడు ఫార్మాట్లలో టీమిండియా కోచ్‌గా గంభీర్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలాగే ప్రత్యేక కోచ్‌లను నియమించబోమని జైషా ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ పదవిలో గంభీర్ 3.5 సంవత్సరాలు ఉండనున్నారు. మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో బీసీసీఐ మేలో దరఖాస్తులను ఆహ్వానించింది. చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు కానీ, చివరగా ఇద్దరికి ఇంటర్వులు నిర్వహించారు. వారిలో గంభీర్‌తో పాటు భారత మహిళా జట్టు మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ కూడా ఉన్నారని సమాచారం. ఇక ఫైనల్ గా గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా నియమితులయ్యారు.
టీమిండియా కొత్త కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియమితులైనట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటించారు. భారత జట్టు కోచ్ గా గంభీర్ పేరును ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందనీ, భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. తన కెరీర్ మొత్తంలో అనేక కష్టాలను ఓర్చుకుని, విభిన్న పాత్రల్లో రాణిస్తూ, భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడంలో గౌతమ్ ఆదర్శవంతమైన వ్యక్తి అని తమకు నమ్మకం ఉదన్నారు.
It is with immense pleasure that I welcome Mr as the new Head Coach of the Indian Cricket Team. Modern-day cricket has evolved rapidly, and Gautam has witnessed this changing landscape up close. Having endured the grind and excelled in various roles throughout his… pic.twitter.com/bvXyP47kqJ
— Jay Shah (@JayShah)
కోచ్ గా గంభీర్ ముందున్న సవాళ్లు..
గౌతమ్ గంభీర్ ఐపీఎల్ లో కెప్టెన్ గా కోల్ కతా నైట్ రైడర్స్ కు రెండు ట్రోఫీలను అందించాడు. అలాగే, లక్నో సూపర్‌జెయింట్, కేకేఆర్ జట్లకు మెంటర్ గా పనిచేసి అద్భుతమైన ఫలితాలు అందించాడు. అద్భుతమైన వ్యూహకర్తగా ఎదిగాడు. కేకేఆర్ ను ఐపీఎల్ లో రెండు సార్లు ఛాంపియన్ గా నిలబెట్టడంతో పాటు రెండు సీజన్లలో (2022, 2023) లక్నోను ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. 2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెంటార్‌గా ఉన్నప్పుడు ఆ జట్టును ఛాంపియన్‌గా మార్చాడు. గంభీర్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అద్భుతంగా ఉండటంతో ఇప్పుడు బీసీసీఐ అతన్ని టీమిండియా హెడ్ కోచ్ గా నియమించింది. అతనిపై భారీ అంచనాలే పెట్టుకుంది బీసీసీఐ.
గౌతమ్ గంభీర్ పదవీకాలం జూలై 2024 నుండి డిసెంబర్ 31, 2027 వరకు ఉంటుంది. అతను హెడ్ కోచ్ గా ఉన్న సమయంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ 2025, టీ20 వరల్డ్ కప్ 2026, వన్డే ప్రపంచ కప్ 2027 ఆడుతుంది. మొత్తంగా తన కాలంటో జరిగే మూడు ప్రపంచకప్‌లు, రెండు ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లను గెలిపించే బాధ్యత గౌతమ్ గంభీర్ పై ఉంటుంది. జూలైలో శ్రీలంకతో జరిగే వైట్ బాల్ సిరీస్‌తో గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ ప్రస్థానం ప్రారంభం కానుంది. దీని తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో టీమిండియా రెండు టెస్టుల సిరీస్‌లు ఆడనుంది.
విరాట్ కోహ్లి రెస్టారెంట్‌పై కేసు నమోదు.. ఏం జరిగింది?
సంవత్సరం చివరలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఐదు టెస్టు మ్యాచ్ ల సీరీస్ ఆడనుంది. ఆ తర్వాత 2025లో పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆ ఏడాది మధ్యలో ఇంగ్లండ్ పర్యటన కూడా ఉంది. భారతదేశం-శ్రీలంక సంయుక్తంగా 2026లో టీ20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అలాగే, 2027 వన్డే ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికాలో ఆడాల్సి ఉంది. కోచ్ గంభీర్ కూడా తమ కెరీర్ చివరి దశలో ఉన్న ఇద్దరు దిగ్గజాలైన విరాట్ కోహ్లి (35 ఏళ్లు), ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ (37 ఏళ్లు)లను ఎలా డీల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
కాగా, టీమిండియా ప్రధాన కోచ్ గా బీసీసీఐ అధికారిక ప్రకటన తర్వాత గౌతమ్ గంభీర్ స్పందిస్తూ సంతోషం వక్యతం చేశారు. దేశానికి ఈ విధంగా సేవ చేయడం చాలా ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు. 'భారతదేశం నా గుర్తింపు, నా దేశానికి సేవ చేయడం నా జీవితంలో అతిపెద్ద అదృష్టం. నేను వేరే టోపీని ధరించినప్పటికీ తిరిగి వచ్చినందుకు గర్వపడుతున్నాను. కానీ నా లక్ష్యం ఎప్పటిలాగే, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేయడం. మెన్ ఇన్ బ్లూ 1.4 బిలియన్ల భారతీయుల కలలను వారి భుజాలపై మోస్తుంది. ఈ కలలను నిజం చేయడానికి నేను నా వంతు కృషి చేస్తాను!' అని అన్నారు.
India is my identity and serving my country has been the greatest privilege of my life. I’m honoured to be back, albeit wearing a different hat. But my goal is the same as it has always been, to make every Indian proud. The men in blue shoulder the dreams of 1.4 billion Indians… pic.twitter.com/N5YyyrhXAI
— Gautam Gambhir (@GautamGambhir)
శ్రీలంక టూర్.. టీమిండియాకు కొత్త కెప్టెన్.. పోటీలో ఆ ఇద్దరు.. !