శ్రీలంక టూర్.. టీమిండియాకు కొత్త కెప్టెన్.. పోటీలో ఆ ఇద్దరు.. !

By Mahesh Rajamoni  |  First Published Jul 9, 2024, 4:55 PM IST

Team India's new captain : టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ట్రోఫీని గెలుచుకుని ప్ర‌పంచ ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడుతోంది. దీని తర్వాత  భార‌త జ‌ట్టు శ్రీలంక పర్యటనకు వెళ్ల‌నుంది. అక్కడ మూడు టీ20లు, 3 వ‌న్డే మ్యాచ్ ల సిరీస్ ల‌ను ఆడ‌నుంది. 
 


India tour of Sri Lanka 2024 : బార్బ‌డోస్ వేదిక‌గా జ‌రిగిన టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ట్రోఫీని గెలిచి టీమిండియా ఛాంపియ‌న్ గా నిలిచింది. గ‌తంలో ధోని  సార‌థ్యంలో ఈ ఫార్మాట్ లో తొలి టైటిల్ అందుకున్న భార‌త్.. ఇప్పుడు రెండోసారి రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. ప్రపంచ ఛాంపియన్ టీమిండియా ప్రస్తుతం జింబాబ్వేతో శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలో టీ20 సిరీస్ ఆడుతోంది. దీని తర్వాత భారత జ‌ట్టు శ్రీలంక పర్యటనకు వెళ్ల‌నుంది. శ్రీలంక‌తో మూడు టీ20లు, మూడు వ‌న్డే మ్యాచ్ ల సిరీస్ ల‌ను ఆడ‌నుంది. అయితే, కొత్త కెప్టెన్‌తో భారత జట్టు శ్రీలంక వెళ్ల‌నుంది. దీని కోసం ఇద్దరు ఆటగాళ్లు పోటీ పడుతున్నారు.

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ట్రోఫీ గెలిచిన త‌ర్వాత హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీని వీడుతూ ఈ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. అలాగే, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కూడా టీ20  క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. దీంతో వీరు శ్రీలంక‌తో టీ20 సిరీస్ లో ఉండ‌రు.  ఇదే స‌మ‌యంలో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌లో వీరిద్దరికీ విశ్రాంతినిచ్చే అవకాశముంది.

Latest Videos

రోహిత్‌-విరాట్‌లు ఏప్పుడు జ‌ట్టులో చేరుతారు?

బీసీసీఐ వ‌ర్గాల ప్ర‌కారం..  'వ‌న్డే జట్టులో ఇద్దరూ (రోహిత్-విరాట్) ప్లేయ‌ర్ల ఎంపిక‌లు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్‌తో జరిగే మూడు  వ‌న్డే మ్యాచ్ లు ప్రాక్టీస్ చేయడానికి సరిపోతాయి. రాబోయే కొద్ది నెలల్లో, వారు రెండు టెస్ట్ మ్యాచ్‌లను కూడా ఆడ‌నున్నారు. సెప్టెంబర్-జ‌న‌వరి మధ్య భార‌త్ 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. అటువంటి పరిస్థితిలో వారిద్దరూ ఇప్పుడు బంగ్లాదేశ్‌తో సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్ నుండి భార‌త జ‌ట్టులో చేరుతారు' అని ప‌లు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.

కొత్త కెప్టెన్ ఎవ‌రు? 

శ్రీలంక టూర్‌లో టీమిండియా మూడు వన్డేల సిరీస్ కూడా ఆడనుంది కాబట్టి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టూర్‌లో ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యాకు ప‌గ్గాలు అప్ప‌గించే అవ‌కాశ‌ముంది. అయితే, దక్షిణాఫ్రికాలో వన్డే జట్టుకు నాయకత్వం వహించిన కేఎల్ రాహుల్ శ్రీలంక పర్యటనలో కూడా జట్టుకు కెప్టెన్ గా తిరిగి రావ‌చ్చు. దీంతో కెప్టెన్సీతో పాటు, ఆటగాళ్ల ఎంపికలో సెలెక్టర్లు ఎవరికి అవకాశం ఇస్తార‌నేది ఆసక్తికరంగా మారింది.

కేఎల్ రాహుల్ కు టీ20 ప్రపంచ కప్ భార‌త జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. ఇదే స‌మ‌యంలో హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెల‌వ‌డంతో త‌న‌దైన‌ పాత్ర పోషించాడు. గ్రూప్, సూపర్-8, సెమీ-ఫైనల్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్ మ్యాచ్‌లో కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. టీ20 ప్రపంచ కప్ గెలవడానికి టీం ఇండియా తన 17 ఏళ్ల నిరీక్షణను తెర‌దించ‌డంలో కీల‌కంగా ఉన్నాడు. ఈ టోర్నీలో హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ మంచి ప్రదర్శన చేశాడు. దీంతో హార్దిక్ కు కెప్టెన్సీ అప్ప‌గించే అవ‌కాశాలు ఎక్కువ‌గానే  ఉన్నాయి. అయితే, బీసీసీఐ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.. !

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ కాదు.. నా లైఫ్‌లో ముఖ్యమైన క్యాచ్‌ అదే.. సూర్య‌కుమార్ యాద‌వ్

click me!