
ఐపీఎల్( IPL2021) సెకండ్ ఫేస్ ఆసక్తిగా సాగుతోంది. కాగా.. మంగళవారం పంజాబ్ కింగ్స్( Punjab kings), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)జట్టు మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అసలు సిసలైన మజా కనపడింది. చివరి ఓవర్ వరకు మ్యాచ్ పంజాబ్ దే అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా.. కేవలం నాలుగు పరుగులు చేయాల్సిన సమయంలో.. కార్తీక్ త్యాగి(Kartik Tyagi) మాయ చేశాడు. అతని మాయాజాలానికి ఫిదా కానివారెవ్వరూ లేరు ఇప్పుడు. తన బౌలింగ్ మాయా జాలంలో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్ మెన్ లు అల్లాడిపోయారు. నాలుగు పరుగులు తీయాల్సిన సమయంలో రెండు వికెట్లు కోల్పోయి.. గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారు.
చివరి ఓవర్లో పంజాబ్ కింగ్స్ విజయానికి 4 పరుగులు అవసరం కాగా.. కార్తీక్ త్యాగి ఒక పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో కచ్చితంగా తమదే గెలుపు అనుకున్న కింగ్స్‌కు నిరాశే ఎదురైంది. పంజాబ్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (67; 43 బంతుల్లో 7×4, 2×6), కేఎల్ రాహుల్ (49; 33 బంతుల్లో 4×4, 2×6) రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంకు చేరుకుంది.
కాగా.. కార్తీక్ ఆట తీరుకి అందరూ ఫిదా అయిపోతున్నారు. రెండు పరుగుల తేడాతో జట్టును గెలిపించిన కార్తీక్ ని పొగడకుండా ఎవరూ ఉండలేకపోతున్నారు. తాజాగా కార్తీక్ పై జస్ప్రీత్ బుమ్రా( Jasprit Bumrah), డేల్ స్టెయిన్(Dale Steyn) ప్రశంసల వర్షం కురిపించారు.
కార్తీక్ ఆటకు ఫిదా అయిపోయిన బుమ్రా.. ట్విట్టర్ వేదికగా స్పందించాడు. వాట్ ఏ ఓవర్ అంటూ పేర్కొన్నాడు. అంత ఒత్తిడి సమయంలోనూ చాలా ప్రశాంతంగా ఉంటూ.. చాలా బాగా ఆడాడు అంటూ కార్తీక్ త్యాగిని ట్యాగ్ చేశాడు. కార్తీక్ ఆటకు తాను ఇంప్రెస్ అయ్యానంటూ బుమ్రా పేర్కొన్నాడు. తాను కార్తీక్ ఆటకు ఎంతలా ఫిదా అయిపోయాడో.. ఒక్క ట్వీట్ తో బుమ్రా తెలియజేయడం విశేషం. కాగా.. ఐపీఎల్ లో ఇదే బెస్ట్ లాస్ట్ ఓవర్ అంటూ డేల్ స్టెయిన్ పేర్కొన్నారు.